ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆట కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆటకు లేనంత క్రేజ్ క్రికెట్ ఆటకు ఉంటుంది. మ్యాచ్ వస్తుందంటే స్టేడియాలు కు చేరుకుని వీక్షించేందుకు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఇంకొంతమంది స్టేడియం కి వెళ్ళి మ్యాచ్  చూడలేనివారు టీవీల ముందు కూర్చుని మ్యాచ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక తమ అభిమాన ఆటగాళ్ళ సిక్సర్లు ఫోర్లు కొడుతూ అద్భుత ప్రదర్శన చేస్తూ ఉంటే ముందు టీవీ ల ముందు  కూర్చున్న ప్రేక్షకులందరూ ఎగిరి గంతేస్తుంటారు .  స్టేడియంలో డైరెక్ట్ గా మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల ఆనందం అయితే మాటల్లో చెప్పలేనిది. 

 

 

 అయితే క్రికెట్ లో రికార్డులు బద్దలు కొట్టడం కామన్ గా  జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రికార్డులు బద్దలు కొట్టడం కోసం ఆటగాళ్లు  ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దిగ్గజ ఆటగాళ్లు  నెలకొల్పిన రికార్డులను బద్దలు కొడితే ఆటగాళ్లకు ఎంతో బూస్ట్  లభిస్తూ ఉంటుంది. అటు ప్రేక్షకులు కూడా తమ అభిమాన ఆటగాడు రికార్డులు బద్దలు కొడుతుంటే ఎంతో ఆనంద పడిపోతుంటారు. ఇప్పటికి ఎంతో మంది ఆటగాళ్లు ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి తన పేరుని ఎక్కించుకున్నారు. తాజాగా మరో ఆటగాడు 109 ఏళ్ల రికార్డును సమం చేసి తన పేరును లిఖించుకున్నాడు. 

 

 

 సౌత్ ఆఫ్రికా తో రెండో టెస్ట్లో ఇంగ్లండ్ ఓపెనర్ డామ్ సిబ్లి  109 ఏళ్ల రికార్డును సమం చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో  సెంచరీ చేయడంతో ఆ అరుదైన క్లబ్లో చేరాడు ఇంగ్లాండ్ ఓపెనర్  డామ్ సిబ్లి  . కాగా  1910లో న్యూలాండ్స్ గ్రౌండ్స్ లో  ఇంగ్లాండ్ ఓపెనర్  జాక్ హాబ్స్  సెంచరీ చేయగా.. ఆ తర్వాత ఈ గ్రౌండ్ లో ఎన్ని మ్యాచ్లు జరిగినప్పటికీ ఏ ఇంగ్లాండ్ ఆటగాడు కూడా ఈ గ్రౌండ్లో సెంచరీ చేయలేకపోయాడు. తాజాగా డామ్ సిబ్లి  సౌత్ఆఫ్రికా ఇంగ్లాండ్  రెండో టెస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి 109 ఏళ్ళ   రికార్డును సమం చేశాడు . కాగా  అటు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: