నిన్న భారత్ శ్రీలంక మధ్య బర్సపర క్రికెట్ స్టేడియంలో తొలి టీ20 జరిగేసమయంలో సరిగ్గా అదే సమయానికి వాన దేవుడు టీ20 ఒక్క బంతి కూడా కొట్టకుండానే మ్యాచ్ రద్దయ్యింది. వర్షం ఆగక అంపైర్లు, అధికారులు పిచ్‌ను మూడుసార్లు పరిశీలించిన తర్వాత మ్యాచ్‌ను కొనసాగించడం సాధ్యం కాదని రద్దు చేశారు. 

 

వర్షం ఆగిన తర్వాత పిచ్‌ను ఆరబెట్టేందుకు గ్రౌండ్ సిబ్బంది ఎంతో కస్టపడి శ్రమించారు.. దానికి ఫలితం లేకపోగా ఆ శ్రమ విర్శలకు కారణమైంది. ఎందుకు అనుకుంటున్నారా ? పిచ్‌ను ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయ్యర్లు, ఐరన్ బాక్స్‌లు, వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించడమే ఇందుకు కారణం. 

 

ఈ పనిని కాస్త సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు తీసి పోస్ట్ చేశారు. దీంతో అవి చూసిన వారు అంత బీసీసీఐపై మండిపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు అయిన బీసీసీఐ ఇస్త్రీపెట్టెతో పిచ్‌ను ఆరబెట్టడం ఏంటంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. 

 

ఈ పని పాకిస్థాన్ క్రికెట్ ప్రియులకు వరంలా మారింది. దీంతో వారు కూడా బీసీసీఐని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పిచ్‌ను ఆరబెట్టేందుకు తామైతే ఆర్మీ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తామని, వారిని సంప్రదించి ఉంటే పిచ్‌ను ఆరబెట్టేందుకు బీసీసీఐకి ఓ హెలికాప్టర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ఉండేవాళ్లమంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ టాపిక్ నేడు హాట్ టాపిక్ గా మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా మనమే వాళ్లకు ఈ అవకాశం ఇచ్చాము.. ఇప్పుడు అనుభవించక తప్పదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: