రికార్డుల రారాజు... రన్ మిషిన్.. డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్... ఇలా చెప్పుకుంటూ పోతే విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవైపు జట్టుకు సారథ్యం వహిస్తు  ముందుండి నడిపించడమే కాదు మరోవైపు జట్టులో కీలక ఆటగాడిగా జట్టులోని ఆటగాళ్లు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియాకు  విజయాలను సొంతం చేశారు విరాట్ కోహ్లీ. ఇక ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. ఒక్కసారి కోహ్లీ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు అంటే పరుగుల వరద పారాల్సింది. కోహ్లీ బ్యాట్ పడితే బౌలర్ల  వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కోహ్లీ ని  అవుట్ చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బౌలర్లు. కోహ్లీ మాత్రం సొగసైన షాట్లు కొడుతూ క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతో ఉత్సాహాన్ని నింపుతూ టీమిండియాకు విజయాన్ని సొంతం చేస్తూ ఉంటాడు. 

 

 

 ఇక కోహ్లీ రికార్డుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది దిగ్గజ  క్రికెటర్లు సాధించిన రికార్డులని అతి తక్కువ సమయంలోనే సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం టీమిండియా డేర్  అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరగ రాసిన రికార్డులను వేరే ఆటగాళ్లు సాధించడం కూడా చాలా కష్టతరమైనవే . ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్వన్ బ్యాట్మెంటన్ కొనసాగుతూ దూసుకుపోతున్నాడు విరాట్ కోహ్లీ. అంతే కాకుండా అటు జట్టు సారథ్యంలో కూడా ఎన్నో బాధ్యతలను భుజాలపై వేసుకొని జట్టును ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సంచలన రికార్డును సృష్టించాడు విరాట్ కోహ్లీ. 

 

 

 ఇక ఇప్పుడు మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో ప్రపంచ రికార్డు కోహ్లీకి అడుగు దూరంలో ఊరిస్తోంది. ఇంకా ఒక్క పరుగు చేస్తే చాలు టీ20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం టీ20 లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రోహిత్ శర్మ లు సంయుక్తంగా ఉన్నారు. వీరిద్దరూ 2633 పరుగులు చేశారు. ఇవాళ శ్రీలంకతో జరిగే టి20 మ్యాచ్ లో  కోహ్లీ ఒక పరుగు చేస్తే రోహిత్ దాటేసి  టి20 ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించబోనున్నాడు . ఇంకా ఒక్క  పరుగు దూరంలో ఉన్న ఈ రికార్డును సాధించి మరో సంచలన రికార్డు కోహ్లీ తన ఖాతాలో వేసుకోవాలని క్రికెట్ అభిమానులు అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: