ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ సంచలనం  రషీద్ ఖాన్ బిగ్ బాష్ లీగ్ లో హ్యాట్రిక్  వికెట్ల తో మెరిసినా  తన జట్టు అడిలైడ్ స్ట్రైకర్స్ కు మాత్రం ఓటమి  తప్పలేదు.  బుధవారం  అడిలైడ్ స్ట్రైకర్స్ , సిడ్నీసిక్సర్స్  జట్ల మధ్య  జరిగిన మ్యాచ్ లో సిడ్నీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన  అడిలైడ్ 135పరుగులకే  కుప్ప కూలింది. అనంతరం స్వల్ప  లక్ష్యఛేదనలో బరిలోకి  దిగిన  సిడ్నీ సిక్సర్స్ 19పరుగులకే  రెండు వికెట్లు కోల్పోయింది. ఈదశలో హ్యూజ్స్, విన్సీ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే 6ఓవర్ చివరి బంతికి హ్యూజ్స్ ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. అప్పటికి స్కోర్ 53/3. ఇక 11ఓవర్ లో మరో సారి బంతిని అందుకున్న  రషీద్ ఖాన్  ఆఓవర్ చివరి రెండు బంతులకు విన్సీ , ఎడ్ వర్డ్స్ ను వెనక్కి పంపగా 13ఓవర్ మొదటి బంతికి సిల్క్ ను అవుట్ చేసి టీ 20 ల్లో మూడో హ్యాట్రిక్ ను నమోదు చేశాడు. అయితే చివర్లో వచ్చిన బ్యాట్స్ మెన్ తలో చేయి వేయడం తో  సిడ్నీ సిక్సర్స్  18.4ఓవర్ లోనే విజయం సాధించింది. ఈమ్యాచ్ లో రషీద్ నాలుగు ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి నాలుగు కీలక  వికెట్లు తీశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

bbl