ఢిల్లీ , పంజాబ్  జట్ల మధ్య  జరిగిన  రంజీ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్‌తో  గొడవపడినందుకు టీమిండియా  యువ బ్యాట్స్ మెన్  శుభమన్ గిల్‌‌‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు.  టాస్ గెలిచి  పంజాబ్ బ్యాటింగ్ ఎంచుకోగా ఓపెనర్ గా వచ్చిన  శుభమన్ గిల్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు.  అయితే.. అంపైర్ ఔటివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శుభమన్ గిల్  క్రీజు వదిలి వెళ్లకుండా అంపైర్‌తో  గొడవ పడ్డాడు. కాగా ఆ అంపైర్ కు అదే తొలి మ్యాచ్ కావడంతో  కంగారు పడి అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. దాంతో  ఢిల్లీ టీమ్  మ్యాచ్  ఆడబోమంటూ మైదానం వెలుపలికి వెళ్లే ప్రయత్నం చేసింది. ఆతరువాత  మ్యాచ్ రిఫరీ జోక్యంతో మ్యాచ్ మళ్ళీ కొనసాగింది. ఇక  క్రమశిక్షణ తప్పి ఈ వివాదానికి కారణమైన గిల్‌ కు రిఫరీ  మ్యాచ్‌ ఫీజులో 100 శాతం కోత విధించాడు. 
 
 
ఇక గత ఏడాది  సౌతాఫ్రికా తో  సిరీస్ రూపంలో టీమిండియా  తరపున  అంతర్జాతీయ టెస్టు  సిరీస్ కు ఎంపికైయ్యాడు శుభమాన్ గిల్. ఆతరువాత  బంగ్లాదేశ్ జరిగిన  టెస్టు సిరీస్ కు కూడా ఎంపికైనా  ఈ రెండు సిరీస్ లలో గిల్ కు ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: