ఇటీవలే జరిగిన ప్రపంచ మహిళా రాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌ పోటీల్లో స్వర్ణం సాధించిన గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపికి అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమెను సన్మానించారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్ ను కోనేరు హంపి ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. 

 

ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ కోనేరు హంపిని అభినందించి రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో కోనేరు హంపిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడ శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వరల్డ్ చాంపియన్‌షిప్ సాధించిన సందర్భంగా గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

 

ఇప్పటికే సీఎం జగన్ విశ్వవిజేతగా నిలిచిన కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. హంపి సాధించిన విజయం దేశ, రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, అతని సుపుత్రుడు నారా లోకేష్ కూడా కోనేరు హంపికి అభినందనలు తెలియజేశారు. అంతేకాదు కోనేరు హంపిని దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసలతో ముంచేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: