ఎంతోమంది పెద్దలు  తమకు ప్రియమైన వారిపై కొన్ని నమ్మకాల పెట్టుకుంటారు. వారిపైన ఎన్నో కలలు కంటూ ఉంటారు.మా వాడు  అది కావాలి ఇది కావాలి అని  లక్ష్యాలను పెట్టుకుంటారు. పిల్లల తల్లి తండ్రులు తాతలు ఇలాంటి నమ్మకాలు  ఎక్కువగా పెట్టుకుంటారు. పిల్లలు ఇలాంటి వృత్తి లో ఉండాలి అలాంటి వృత్తిలో ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇక్కడ ఓ తాత మనవడు మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు. డాక్టరో  యాక్టర్ అవ్వాలని కాదు... నా మనవడు స్టార్ క్రికెటర్ అవ్వాలని... అంతర్జాతీయ క్రికెట్ లో రాణించాలని ఆ తాత మనవడు మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నాడు. ఎప్పటికైనా నా మనవడు అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తాడు  అని ఓ పందెం కూడా వేసాడు. 

 

 

 చివరికి తాత నమ్మకాన్ని నిలబెట్టాడు మనవడు. ఇంతకీ ఆ మనవడు ఎవరు అనుకుంటున్నారా... అంతర్జాతీయ క్రికెట్ లో తనదైన శైలిలో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతూ ఎన్నో రికార్డులు బద్దలుకొడుతున్న... ఇంగ్లాండ్ క్రికెటర్ డామ్ సిబ్లి . డామ్  సిబ్లి  తాతగారు ఇతడిపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. 2011 సంవత్సరం లో ఎప్పటికైనా తన మనవడు అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తాడు అని ఒప్పందం కూడా వేశాడు. చివరికి తాత నమ్మకాన్ని నిలబెడుతూ అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్నాడు డామ్ సిబ్లి . ఒక స్టార్ క్రికెటర్ గా ఎదిగిపోయాడు. వరుస రికార్డులు బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోతున్నాడు యువ క్రికెటర్. ప్రస్తుతం జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 

 

 

 అయితే ఇతని తాత మనవడు మీద ఎంతో  నమ్మకం. ఆ నమ్మకంతోనే తన మనవడు అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడని  2011లో తో బెట్టింగ్ వెబ్సైట్లో పందెం కాసాడు . అయితే ఈ బెట్టింగ్ వేసిన కొన్ని నెలలకే ఆయన మరణించారు. కాగా  ఇప్పుడా తాత నమ్మకాన్ని నిలబెట్టాడు మనవడు డామ్ సిబ్లి . అంతేకాదు సౌత్ ఆఫ్రికా లో జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. డామ్ సిబ్లి  తాత  మెకంజీ  పందెం గెలవడంతో అతని కుటుంబానికి 20 లక్షల వరకు డబ్బులు వచ్చాయి. ఇలాంటి విషయాలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. నమ్మకం పెట్టుకున్న వారు ఈ లోకంలో లేకపోయినప్పటికీ వారి నమ్మకం చనిపోయిన తర్వాత అయినా నిలబడుతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: