ఆటగాడు బ్యాటు పెడితే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే... ఒకసారి బరిలోకి దిగాడు అంటే  జట్టుకు విజయం వరించాల్సిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన రికార్డుల రారాజు,. ఎన్నోసార్లు పరుగుల వరద పారించారు రన్ మిషన్ .. ఈ ఆటగాడు ఇంకెవరో కాదు టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ పరుగుల వరద పారిస్తూ  మైదానంలో తనదైన దూకుడుతో ప్రత్యర్థి ఆటగాళ్ల  వెన్నులో  వణుకు పుట్టిస్తూ జట్టుకు ఎన్నో విజయాలను సొంతం చేసిన గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ అనే పుస్తకంలో తనకంటూ కొన్ని  ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్న గొప్ప ఆటగాడు. దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యమైన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బద్దలు కొట్టి తన పేరును లిక్కించుకున్నాడు విరాట్ కోహ్లీ. 

 

 

 ఇప్పటికే ఎన్నో విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టాడు. కోహ్లీ  తిరగరాసిన రికార్డులను  సాధించడం మిగతా ఆటగాళ్లకు కష్టతరమైన పని. ఎందుకంటే దిగ్గజ క్రికెటర్ లకు సైతం సాధ్యంకాని రికార్డుల్ని విరాట్ కోహ్లీ సృష్టించాడు. జట్టుకు నాయకత్వం వహిస్తూ బాధ్యతలన్నీ భుజాలపై వేసుకొని జట్టును ముందుండి నడిపిస్తునే  మరోవైపు మైదానంలో దూకుడుగా ఆడుతూ భారీ స్కోరు నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అంతేకాకుండా ఆటలో తనదైన దూకుడుతో క్రికెట్ ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ఒకసారి విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగాడు  అంటే పరుగుల వరద పారాల్సిందే . అందుకే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చాడు అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుడుతుంది. 

 

 

 ఇకపోతే గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్  గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో  మరో సారి బ్యాటింగ్  విభాగంలో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. గత కొన్నేళ్ల నుంచి నెంబర్వన్ స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ తాజాగా మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. రెండవ స్థానంలో స్మిత్ కొనసాగుతుండగా... మూడో స్థానంలో అద్భుత ఫామ్ లో  ఉన్న ఆసీస్ ప్లేయర్ లబుషేక్  మూడో స్థానానికి ఎగబాకాడు. ఇక పుజారా 5, 9 స్థానాల్లోకి కొనసాగుతున్నారు. అటు బౌలింగ్ విభాగంలో ఆసీస్ బౌలర్ కమ్మిన్స్  మొదటి స్థానంలో ఉండగా ... రెండోస్థానంలో నేల్ వాగ్నర్  ఉన్నారు.. ఆరు తొమ్మిది పది స్థానాలలో బుమ్రా,  అశ్విన్ షమీ కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: