ఇంగ్లాండ్ సీనియర్ పేసర్  జేమ్స్ ఆండర్సన్  గాయం కారణంగా  సౌతాఫ్రికా  తో జరుగనున్న  చివరి రెండు టెస్టుల నుండి తప్పుకున్నాడు.  ప్రస్తుతం ఇంగ్లాండ్ టీం  సౌతాఫ్రికా లో పర్యటిస్తుంది. అందులో భాగంగా ఇటీవల ఈరెండు జట్ల మధ్య  4మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభం కాగా  ఇప్పటివరకు  ఇరు జట్లు రెండు టెస్టుల్లో తలపడి   చెరో విజయం సాధించి  సిరీస్ ను 1-1 తో సమం చేసుకున్నాయి. 
 
మూడో టెస్టు  ఈనెల 16నుండి పోర్ట్ ఎలిజబెత్ లో జరుగనుంది. ఇక ఈమ్యాచ్ కు ఆండర్సన్  దూరం కావడంతో  ఇంగ్లాండ్  కు  ఎదురు దెబ్బ తగిలింది. రెండో టెస్టు లో  మొదటి ఇన్నింగ్స్ లో 5వికెట్లు పడగొట్టి  సౌతాఫ్రికా ను దెబ్బ తీశాడు ఆండర్సన్.  అంతే కాదు  ఆమ్యాచ్ లో  5వికెట్ల తీయడం ద్వారా అత్యధిక సార్లు టెస్టుల్లో  5వికెట్ల తీసిన  మొదటి ఇంగ్లాండ్ బౌలర్ గా  ఆండర్సన్  రికార్డు సృష్టించాడు. ఇక  అతని స్థానం లో  చివరి రెండు టెస్టులకు  క్రేగ్ ఓవర్ టన్ ను ఎంపిక చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అలాగే రెండో టెస్టుకు దూరంగా వున్న ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు  జోఫ్రా ఆర్చర్ , మార్క్ వుడ్ లు  మూడో టెస్టు కు అందుబాటులోకి  వచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: