అతను జట్టులో ఉన్నాడు అంటే జట్టుకు విజయం ఖాయం... ఈ ఆటగాడు వ్యూహాల ముందు ప్రత్యర్థి ఊహలన్నీ పటాపంచలై పోతాయి... క్లిష్ట పరిస్థితుల్లో కూడా జట్టును  విజయ తీరాల వైపు నడిపించే సత్తా  అతని సొంతం. అతనే  మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. క్రికెట్ చరిత్రలోనే తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు  లిఖించుకున్న గొప్ప ఆటగాడు మహేంద్రసింగ్ ధోని. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్స్  ఎవరికీ సాధ్యం కాని రెండు ప్రపంచ కప్ లను  భారత్ కి సొంతం చేశాడు మహేంద్రసింగ్ ధోని. అయితే గత కొంతకాలంగా ధోని మ్యాటర్ ప్రస్తుతం క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ లో  పేలవ ప్రదర్శన చేసిన ధోని విమర్శల పాలయ్యాడు. 

 

 

 ప్రపంచకప్ తర్వాత అసలు ధోని ఎక్కడ మైదానంలో కనిపించలేదు. తర్వాత కొన్ని రోజులపాటు క్రికెట్కు విరామం తీసుకుని  ఆర్మీలో చేరారు. ఇక ఆర్మీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు  కనిపించలేదు. తాను క్రికెట్ కు కొన్నాళ్ళు  అందుబాటులో ఉండలేనని  కలెక్టర్లకు చెప్పేస్తున్నాడు ధోని . ఈ నేపథ్యంలో ధోని  క్రికెట్ కు వీడ్కోలు పలుకడం  ఖాయమంటూ ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ ప్రముఖులు కూడా ధోనీ రిటైర్మెంట్ పై స్పందించి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై స్పందించిన ధోని  తనకు జనవరి వరకు ఏమీ అడగవద్దు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. చివరికి జనవరి రానేవచ్చింది దీంతో ధోనీ భవితవ్యం ఏంటి అన్న దానిపై మరోసారి చర్చ మొదలైంది. 

 

 

 ఇకపోతే తాజాగా ఇండియా కోచ్ రవిశాస్త్రి  ధోని రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో ధోని తనకుతానే నిరూపించుకుంటూనే 20 ప్రపంచకప్ లో  ధోని కి అవకాశం లభిస్తుంది అని కామెంట్ చేశారు టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి. ముంబైలో జరిగిన ఓ మీడియా సమావేశంలో రవిశాస్త్రి ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని ఎప్పుడు జట్టుకు భారం కాదు అంటూ తెలిపారు. ఇప్పటివరకు టెస్ట్ ఫార్మర్ కి గుడ్ బై చెప్పిన ధోని  త్వరలో వన్డే  ఫార్మాట్ కు కూడా  గుడ్ బై  చెప్పేస్తాడు  అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రవిశాస్త్రి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: