టీమిండియా గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతూ వరుస సిరీస్ లను  కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా టీమ్ ఇండియా జట్టు ఎంతో పటిష్టంగా మారింది. టాప్ ఆర్డర్ మిడిలార్డర్ బౌలింగ్ బ్యాటింగ్ ఫీలింగ్ ఇలా అన్ని విషయాలు టీమ్ ఇండియా జట్టు అంతకు ముందెన్నడూ లేని విధంగా రాటుతేలినది . మ్యాచ్ ఏదైనా ఫార్మెట్ ఏదైనా రోహిత్ శర్మ తో కూడిన టాపార్డర్ భారీ స్కోరుకు పునాది వేస్తుండగా.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించి భారీ స్కోరును నమోదు చేయడంలో మిడిలార్డర్ కీలక పాత్ర వహిస్తుంది. దీంతో టీమిండియా జట్టు చూస్తే  ప్రతి జట్టులో వణికిపోతున్నాయి. 

 


 మరోవైపు బౌలింగ్లో కూడా టీమిండియా మునుపెన్నడూ లేని విధంగా పేస్ బౌలర్లతో పటిష్టంగా తయారైంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా టీమ్  మేనేజ్మెంట్ కు  పెద్ద తలనొప్పి వచ్చి పడింది.అదేంటంటే... ఏడాది అక్టోబర్లో జరగనున్న టి20 వరల్డ్ కప్ జట్టుకు ఆటగాళ్లను ఎంపిక చేయడం సవాలుగా మారిపోయింది. ముఖ్యంగా ఓపెనింగ్ స్లాట్లు ఎంపిక చేయడం కష్టసాధ్యంగా మారింది టీం మేనేజ్మెంట్ కు. టీమిండియా జట్టు ఓపెనింగ్ కి సంబంధించిన రోహిత్ శర్మ, కె.ఎల్.రాహుల్, శిఖర్ ధావన్ లలో ఇద్దరిని ఎంపిక చేయాల్సి ఉంది. ఇక ఈ ముగ్గురు స్టార్ క్రికెటర్లు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంటూ భారీ స్కోరును నమోదు చేస్తున్నారు. దీంతో టీమిండియా మేనేజ్మెంట్ కు  ఇది పెద్ద సవాలుగానే మారిపోయింది. 

 


 ఈ నేపథ్యంలో ఈ అంశంపై టీం ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ... తాము  ముగ్గురం ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతున్నామని  తెలిపారు. రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని.. రాహుల్ గత రెండు మూడు నెలలుగా బాగా రాణిస్తున్నారని తెలిపిన శిఖర్ ధావన్... శ్రీలంకతో జరిగిన మూడో టి-20లో తాను బాగా ఆడాను అని తెలిపారు. అయితే టీ20 ప్రపంచ కప్ సిరీస్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారన్న దానిపై స్పందించిన శిఖర్ ధావన్.. జట్టు ఎంపిక తో తనకు సంబంధం లేదని... అందుకే తాను దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన రెండు అవకాశాలను తాను చక్కగా వినియోగించుకున్నానని ... ఈ అంశం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అంటూ శిఖర్ ధావన్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: