ఇటీవల  శ్రీలంకతో జరిగిన  టీ 20సిరీస్ ను గెలుచుకొని ఈఏడాది ని ఘనంగా ఆరంభించిన  టీమిండియా తరువాత ఆస్ట్రేలియా ను ఢీ కొట్టనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు భారత్ చేరుకుంది. ఇరు జట్ల మధ్య  మూడు మ్యాచ్ ల వన్డే  సిరీస్  జనవరి 14న ముంబైలో ప్రారంభం కానుంది. ఇక ఈ సందర్బంగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్  మీడియా సమావేశం లో  పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఆసిస్ తో వన్డే సిరీస్ కు ఓ ఓపెనర్ గా  రోహిత్ శర్మ  కన్ ఫర్మ్ .. ఇటీవల అతను అద్భుతమైన  ఫామ్ లో వున్నాడు. అయితే మరో ఓపెనర్  గా ఎవరిని పంపించాలని డైలమా లో ఉన్నామని రాథోర్ అన్నాడు. 
 
 
గత కొన్ని సిరీస్ లనుండి రాహుల్ అద్భుతమైన ఫామ్ లో వున్నాడు. అలాగే గాయం నుండి కోలుకొని  తాజాగా జరిగిన శ్రీలంక తో టీ 20సిరీస్ లో  శిఖర్ ధావన్  ఫామ్ నిరూపించుకున్నాడు. దాంతో ఈ ఇద్దరి లో ఎవరిని రోహిత్ కు జోడిగా పంపించాలనే  విషయంలో డైలమా కొనసాగుతుంది. అయితే మ్యాచ్ కు ఇంకా రెండు రోజుల సమయంవుంది కాబట్టి యాజమాన్యం ఈ విషయం పై చర్చించి  ఎవరిని పంపాలో నిర్ణయం తీసుకుంటుందని  విక్రమ్ రాథోర్ వెల్లడించాడు. ఇక రెండు బలమైన జట్లు  కావడంతో  తో  ఈ సిరీస్ హోరా హోరీగా సాగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: