2018-2019 సీజన్ కు గాను  భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం నిన్న ముంబై లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు విజేతల తో పాటు  బీసీసీఐ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ , టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అలాగే  పలువురు భారత మాజీ క్రికెటర్లు హాజరైయ్యారు. 
 
ఇక  టీమిండియా యువఫాస్ట్ బౌలర్  జస్ప్రీత్ బుమ్రా ,ఉత్తమ అంతర్జాతీయ  క్రికెటర్ అవార్డు కు ఎంపిక కావడం తో అతన్ని బీసీసీఐ, పాలీ ఉమ్రిగర్ పురస్కారంతో సన్మానించింది.  మహిళా క్రికెటర్ల లో పూనమ్ యాదవ్, ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ గా ఎంపికయ్యింది.  వీరితోపాటు  ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్ర ఆటగాడిగా  మయాంక్ అగర్వాల్ ఎంపిక కాగా మహిళా క్రికెట్ లో షఫాలీ వెర్మ ఈ అవార్డు దక్కించుకుంది. శివమ్ దూబే ను  ఉత్తమ  రంజీ ఆల్ రౌండర్ అవార్డు వరించగా  భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి  శ్రీకాంత్  ను  కోల్ సీకే నాయుడు  జీవిత కాల పురస్కారంతో సత్కరించారు. ఆయనతో  పాటు భారత  మాజీ మహిళా క్రికెటర్ అంజుమ్ చోప్రా ను కూడా  ఈ ప్రతిష్టాత్మక  అవార్డు తో సన్మానించింది బీసీసీఐ.   

మరింత సమాచారం తెలుసుకోండి: