ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. క్రికెట్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోయిన కన్నార్పకుండా చూసే ప్రేక్షకులు ఎంతో మంది. క్రికెట్ ఆటలో కి కూడా యువ ఆటగాళ్లు వస్తూనే ఉంటారు. తమ సత్తా చాటుతూనే ఉంటారు. కొత్తగా వచ్చిన ఆటగాళ్ళు కొంతమంది తమ ప్రతిభను నిరూపించుకుని  అద్భుతంగా రాణిస్తే... ఇంకొంత మంది  ఒత్తిడిని తట్టుకోలేక పేలవ ప్రదర్శన టెస్టు జట్టులో స్థానం  కోల్పోతుంటారు. సాదా సీదా నాటకాలు అద్భుతమైన రికార్డులు సృష్టించే ఆటంగాళ్ళుగా రాటుదేలాలీ అంటే వాళ్లకి ఒకటే మార్గం టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్లో అసలు సిసలైన ఆటగాళ్లలో నీ ప్రతిభ బయటపడుతుంది. 

 

 

 ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో సుదీర్ఘ మైన ఇన్నింగ్స్ ఆడటానికి ప్రతి ఒక్క ఆటగానికి అవకాశం ఉంటుంది కాబట్టి... జట్టులో ఏ స్థానంలో బ్యాటింగ్ కు  దిగినప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అటు బౌలర్లు కూడా బ్యాట్ మెన్లను  ఎలా కట్టడి చేయవచ్చు అనే దానిపై ఎక్కువ ఓవర్స్  వేస్తూ ఉంటారు కాబట్టి బౌలింగ్ కూడా మెరుగుపడుతు రాటుతేలుతూ ఉంటారు. అందుకే ఎక్కువగా జట్టులో స్థానం సంపాదించిన యువ ఆటగాళ్లు  మొదట టెస్ట్ క్రికెట్ నుంచి మొదలు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ నుండి  వన్డే మ్యాచ్ లోకి రావాలని కుతూహలంతో ఉంటారు. 

 

 

 అయితే ఇన్ని రోజుల వరకు టెస్ట్ మ్యాచ్ ఐదురోజులపాటు జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం టేస్ట్ క్రికెట్  ఐదు రోజుల నుండి నాలుగు రోజులకి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. కేవలం నాలుగు రోజులు మాత్రమే టేస్ట్  నిర్వహించి మిగతా  సమయాన్ని వన్డేల కోసం కేటాయించాలని ఐసీసీ నిర్ణయించింది. అయితే ఐసీసీ నిర్ణయాన్ని క్రికెట్ దిగ్గజాలు అందరూ తప్పుబడుతున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఐసీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో  క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ చేరారు . ఐసీసీ ప్రతిపాదించిన నాలుగు రోజుల టెస్ట్ క్రికెట్ టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్  ఘాటు విమర్శలు చేశారు. డైపర్లు కానీ ఐదు రోజుల టెస్ట్ కానీ వాటి పని పూర్తి అయినప్పుడు మార్చాలని... ఎందుకంటే తిరిగి ఉపయోగించలేని కాబట్టి అంటూ వ్యాఖ్యానించారు వీరేంద్ర సేహ్వాగ్. ఐదురోజుల టెస్టు ఇంకా అంతమవ్వలేదు... టెస్ట్ క్రికెట్ అంటే 143 ఏళ్ళు ఫిట్ గా  వ్యక్తి లాంటిది అంటూ సెహ్వాగ్  వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల ఆట మంచిదే కానీ అది టెస్ట్ క్రికెట్ లో మాత్రం వద్దు అంటూ తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: