మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా  రేపు  ముంబై లోని వాంఖడే లో ఇండియా , ఆస్ట్రేలియా మధ్య  మొదటి వన్డే (డే /నైట్ )మ్యాచ్ జరుగనుంది. గత కొన్నేళ్ల నుండి  ఇరుజట్లు వరుస విజయాలు సాధిస్తూ  ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండడం తో ఈ సిరీస్ హోరాహోరిగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం  ముగ్గురు ఓపెనర్లు  సూపర్ ఫామ్ లో ఉండడం తో  ఓపెనర్లుగా  ఎవరిని తీసుకొవాలనేది టీమిండియా యాజమాన్యం కు తల నొప్పిగా మారింది.  ఓ ఓపెనర్ గా రోహిత్ కన్ ఫర్మ్ కాగా అతనికి  జోడిగా శిఖర్ ధావన్ , రాహుల్ లో ఎవరు వస్తారనేది ఆసక్తిగా మారింది. 
 
తాజాగా  జరిగిన  మీడియా సమావేశం లో కోహ్లీ కి ఇదే ప్రశ్న ఎదురైయింది.  దానికి కోహ్లీ సమాధానమిస్తూ... ముగ్గురు అద్భుతమైన ఆటగాళ్లు , కుదిరితే  ఆముగ్గురు కూడా తుది జట్టులో  వుండే అవకాశం ఉందని పేర్కొన్నాడు. అయితే ఒకవేళ ముగ్గురు తుది జట్టు లో ఉంటే  రోహిత్ కు జోడీగా ధావన్ రానున్నాడు. రాహుల్ నాల్గో స్థానం లో బరిలోకి దిగనున్నాడు. అలా జరిగితే  శ్రేయాస్ అయ్యర్ , శివమ్ దూబే  లలో ఎవరో ఒకరు  బెంచ్ కే పరిమితం కావాల్సి వస్తుంది. చూడాలి మరి జట్టులో ధావన్ తోపాటు రాహుల్ కూడా చోటు దక్కించుకుంటాడో లేదో.   

మరింత సమాచారం తెలుసుకోండి: