ఐసీసీ షెడ్యూల్  ప్రకారం  బంగ్లాదేశ్ జట్టు ఈనెలలో  పాకిస్థాన్ లో పర్యటించాల్సి వుంది. ఈ  పర్యటనలో  ఆతిథ్య జట్టు తో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ తో పాటు రెండు టెస్టులు కూడా ఆడాల్సి వుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లా ఆటగాళ్లు పాకిస్థాన్ పర్యటనకు సుముఖత చూపలేదు. దాంతో నానా తంటాలు పడి బిసిబి , బంగ్లా ఆటగాళ్లను ఒప్పించింది.  అయితే టెస్టులు కాకుండా  షార్ట్ టూర్ అయితేనే వస్తామని వారు తేల్చిచెప్పడం తో  బిసిబి కూడా టీ 20 సిరీస్ ఆడడానికి మాత్రమే వస్తామని పిసిబి కి తెలియజేసింది. 
 
 
ఇదే విషయం పై   బిసిబి  అధ్యక్షుడు నజముల్ హాసన్ మాట్లాడుతూ...   టెస్ట్ సిరీస్ ఆడడం ఇష్టం లేక కాదు ప్రస్తుతం వున్న భద్రతా సమస్యల వల్ల  షార్ట్ టూర్ అయితేనే   ఆటగాళ్లు రెడీ గా వున్నారు.  పరిస్థితులు బాగుంటే మరోసారి పాక్ లో టెస్టు సిరీస్ ఆడతామని ... అలాగే ఇప్పుడు టీ 20సిరీస్ ఆడడానికి మాత్రమే తమ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపాడు. జనవరి 23, 25, 27న ఇరు జట్ల మధ్య లాహోర్ లో మూడు టీ 20 మ్యాచ్ లు జరుగనున్నాయని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: