ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌ కోసం ముమ్మర ప్రాక్టీస్‌ చేసింది కోహ్లీ సేన. మొత్తం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా రేపు ముంబై  భారత్‌-ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి. 

 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలా తాను కూడా ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్‌ అవ్వాలనుకుంటున్నాడని ఆస్ట్రేలియా కీపర్ బ్యాట్స్ మెన్ అలెక్స్ క్యారీ అన్నాడు. గతేడాది ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ నెగ్గడంలో క్యారీ సైతం వికెట్ల వెనుక కీలకపాత్ర పోషించాడు. అయితే తనకు మిడిల్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసి బెస్ట్ ఫినిషర్‌గా మారాలన్నదే తన ఆశయమన్నాడు.

 

గత వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్ల భాగస్వామ్యంలో పాలు పంచుకున్న వికెట్ కీపర్ క్యారీ. బ్యాటింగ్‌లోనూ 62.50 సగటుతో వందకు పైగా స్ట్రైక్ రేట్‌తో 375 పరుగులు సాధించాడు. త్వరలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ఆసీస్ జట్టులో ఎంపికైన అలెక్స్ క్యారీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొన్ని విషయాలపై స్పందించాడు. 'చాలా అంశాల్లో నేను మెరుగవ్వాల్సి ఉంది. మిడిల్, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తే ఆసీస్ బెస్ట్ ఫినిషర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ధోనీ లాంటి ఆటగాడిని గమనిస్తే మ్యాచ్‌ను ఎలా ఫినిష్ చేయవచ్చో తెలుస్తుంది. ధోనీకి ప్రత్యర్థిగా ఆడటం లక్కీగా భావిస్తాను. 

 

సొంతగడ్డపై భారత్ ప్రమాదకర జట్టు. మిడిల్ ఓవర్లలో పటిష్టమైన భారత స్పిన్నర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చివర్లో వరల్డ్ క్లాస్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలను ఎదుర్కోవడం నిజంగానే సవాల్. అయితే నా వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తాను. మా జట్టులోనూ వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నారని' ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ వివరించాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌ కోసం టీమిండియా సిద్ధమౌతోంది. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్‌ కోసం ముమ్మర ప్రాక్టీస్‌ చేసింది కోహ్లీ సేన. మొత్తం 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఎల్లుండి ముంబై వాంఖెడేలో భారత్‌-ఆస్ట్రేలియాల తలపడనున్నాయి. 17న రాజ్‌కోట్‌లో రెండో వన్డే, 19న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మూడో వన్డే జరుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: