హార్దిక్‌ పాండ్యా ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈ ఆటగాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ అని అందరికి తెలుసు. అయితే ఈ అతగాడి ప్రేమ గురించి.. పెళ్లి గురించి ఎన్ని వార్తలు వచ్చాయో అందరికి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే హార్దిక్ పాండ్యకు తన ప్రేయసి అయినా నటాషాతో న్యూ ఇయర్ సందర్భంగా ఎంగేజ్‌మెంట్ చేసేసుకున్నారు. 

 

ఆ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను తీసుకొచ్చి అయన సోషల్ మీడియాలో తనకు ఎంగేజ్‌మెంట్ అయ్యింది అని.. త్వరలోనే పెళ్లి కూడా అని వారు ప్రకటించారు. దీంతో ఆ ఫోటోలు ఓ నాలుగు రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. ఇది అంత ఇప్పుడు పక్కన పెడితే ఈ జంట గురించి ఓ సంచలన వార్త బయటకు వచ్చింది.. అది ఏంటంటే..?

 

నటాషా.. హార్దిక్ పాండ్య కంటే పెద్దది అంట.. పెద్దది అంటే మరి పెద్దది కాదు.. కానీ పెద్దదే.. ఒక సంవత్సరం పెద్దది. ఇది పెద్ద సమస్య కాదు లెండి.. ఎందుకంటే ప్రేమలో వయసు రంగు అందం ఇవి ఏవి కనిపించవు.. ఎందుకంటే ప్రేమ గుడ్డిది కాబట్టి. ఒక్క వీళ్ళ ప్రేమే కాదు.. క్రికెట్ గాడ్ సచిన్ భార్య కూడా సచిన్ కంటే పెద్దది... మరి ఇది ఒక సమస్యేనా.. మరి మీరు షాక్ అయ్యారా ?

మరింత సమాచారం తెలుసుకోండి: