వరుస విజయాలతో  జోరు మీదున్న  టీమిండియా కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది.  కొత్త సంవత్సరం లో మొదటి ఓటిమిని రుచిచూపించింది. ముంబై వేదికగా జరిగిన మొదటి  వన్డే లో భారత్ పై ఆసీస్ 10వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 49.1ఓవర్లలో 255 పరుగులకే ఆల్ అవుట్  అయ్యింది.  ఓపెనర్ శిఖర్ ధావన్ (74), వన్ డౌన్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ (47) మినహా ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.  ఆస్ట్రేలియా  బౌలర్ల లో స్టార్క్ 3,కమ్మిన్స్ 2, కేన్ రిచర్డ్ సన్ 2 వికెట్లు తీయగా జంపా ,అగార్ తలో వికెట్ పడగొట్టారు. 
 
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన  ఆస్ట్రేలియా  37.4ఓవర్ల లోనే   విజయం సాధించింది.  ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (128*),ఆరోన్ ఫించ్ (110*) అజేయ శతకాలతో చెలరేగడం తో ఆసీస్  సులభంగా విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టలేకపోయారు భారత బౌలర్లు.  డేవిడ్ వార్నర్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక  మూడు మ్యాచ్ ల  సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈనెల 17న రాజ్ కోట్ లో జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: