భారత జట్టు బ్యాటింగ్ బౌలింగ్లో పటిష్టంగా మారి ప్రత్యర్థి జట్టులు  అన్నింటినీ చిత్తు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఫార్మాట్ ఏదైనా తనదైన సత్తా చాటుతూ ఎన్నో సిరీస్ను కైవసం చేసుకుంటుంది. అయితే ఇప్పటికే వరుస విజయాలతో దూకుడు మీద టీమిండియాకు తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో బ్రేక్ పడిందనే చెప్పాలి. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా టీమిండియాను  బ్యాటింగ్ కి ఆహ్వానించగా... భారత బ్యాట్స్మెన్లు ఆస్ట్రేలియా బౌలర్ల ముందు నిలువలేక పోయారు. స్టార్ బ్యాట్ మెన్స్ అందరూ వరుసగా అవుట్ అవుతూ  చేతులెత్తేశారు. ఇక భారత్ 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆల్ అ mవుట్ అయిపోయింది. కేవలం 255 పరుగులు చేయడానికి భారత బ్యాట్స్మెన్లు అందరూ ఆపసోపాలు పడ్డారు . 

 

 

 అయితే భారత ఆటగాళ్లలాగే అక్కడున్న పిచ్చి కారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడతారని అందరూ అనుకున్నారు. కానీ ఆసీస్ ఓపెనర్ లు మాత్రం రెచ్చిపోయి ఆడారు. కేవలం ఒక్క వికెట్ పడకుండా భారత బౌలర్ల ముప్పు తిప్పలు పెట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆసీస్ ఆటగాళ్లు. ముందు ఓపెనింగ్ కి దిగిన భాగస్వామే ఏకంగా 255 పరుగులను సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా  డేవిడ్ వార్నర్ నిలిచారు. ఇకపోతే ముగ్గురు ఓపెనర్లు బరిలోకి దిగితే రిషబ్ పంత్ ను జట్టు  నుంచి తప్పించవచ్చని రాహుల్ కీపింగ్ చేస్తాడని మ్యాచ్ కు  ముందు టాక్  కూడా వినిపించింది. అయితే పంత్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడినప్పటికీ చివరికి  రాహుల్ కీపింగ్ చేయాల్సి వచ్చింది. 

 

 

 కారణం... ఆస్ట్రేలియా టీమిండియా మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ గాయం బారిన పడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా తలకు గాయమైంది. కమెన్స్  బౌలింగులో  బంతి ముందుగా బ్యాట్ కు తగిలి ఆ తర్వాత అతని తలకు బలంగా తగిలి  క్యాచ్ గా మారిపోయింది. ఇక ఇన్నింగ్స్ అనంతరం రిషబ్ పంత్ కన్ కక్షన్ కు గురైనట్లు... అతను కీపింగ్ చేయలేదని బీసీసీఐ ప్రకటించింది. దీంతో రాహుల్ కీపింగ్  బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం ప్రత్యేక వైద్యులు పర్యవేక్షిస్తారని బీసీసీఐ  బోర్డు ప్రకటించింది. కాగా ఈ మ్యాచ్లో పంత్ ముప్పై మూడు బంతుల్లో 28 పరుగులు చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: