మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా   మంగళవారం  ముంబై వేదికగా జరిగిన మొదటి  వన్డే లో భారత్ పై ఆసీస్ సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో  మొదట  బ్యాటింగ్ కు దిగిన భారత్ 49.1ఓవర్లలో 255 పరుగులకే ఆల్ అవుట్  అయ్యింది.  ఓపెనర్ శిఖర్ ధావన్ (74) వన్ డౌన్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ (47) మినహా ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.  ఆసీస్ బౌలింగ్  కు మిగితా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. 
 
అనంతరం కష్టతరం కానీ  లక్ష్యం తో  బరిలోకి  దిగిన ఆస్ట్రేలియా  ఆడుతూ పాడుతూ  37.4ఓవర్ల లోనే   విజయం సాధించింది.  ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (128*),ఆరోన్ ఫించ్ (110*) అజేయ శతకాలతో చెలరేగారు.  బుమ్రా వంటి  నెంబర్ 1 ర్యాంక్  బౌలర్  కూడా ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. దాంతో ఆసీస్ 10 వికెట్ల తేడాతో  ఘన విజయం సాధించింది. ఇక  స్వదేశం లో వన్డే ల్లో భారత్  ఇలా 10వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇది రెండో సారి ...  ఇంతకుముందు  2005 లో కోల్ కత్తా  లో ఇండియా తో జరిగిన వన్డే లో  సౌతాఫ్రికా 189 పరుగుల లక్ష్యాన్ని  వికెట్ నష్టపోకుండా ఛేదించింది.  ఓవరాల్ గా భారత్, వన్డే ల్లో  10వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇది నాల్గోసారి కాగా వన్డే లో ఆసీస్ 10వికెట్ల తేడాతో గెలుపొందడం ఇది 5వసారి. 

మరింత సమాచారం తెలుసుకోండి: