ముంబై లోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా తో జరిగిన మొదటి వన్డే లో ఆసీస్ పేసర్  పాట్ కమ్మిన్స్  బౌలింగ్ లో  గాయపడ్డ  టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్  రెండోవన్డే కు దూరం అయ్యాడు. మొదటి వన్డే లో గాయపడ్డ అనంతరం  అవుట్ అయ్యి పెవిలియన్ చేరుకున్న పంత్ ను వెంటనే హాస్పటల్ కు తరలించారు. అయితే ప్రమాదం ఏం లేకున్నా పంత్ ను కొన్ని రోజులు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు సూచించడం తో  జాతీయ క్రికెట్ అకాడమీ లో పంత్, వైద్య బృందం  పర్యవేక్షణలో ఉండనున్నాడు. దాంతో రాజ్ కోట్ లో ఈ నెల 17న ఆస్ట్రేలియా,భారత్ ల మధ్య జరుగనున్న రెండో వన్డే కు అతను  దూరం కానున్నాడు. 
 
ఇక  బ్యాక్ అప్ కీపర్ కూడా లేకపోవడంతో  మొదటి వన్డే లో కీపింగ్ చేసిన  కేఎల్ రాహులే  రెండో వన్డే లో కూడా వికెట్ల వెనుక  బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.  అయితే మొదటి వన్డే లో వార్నర్ ఇచ్చిన క్యాచ్ ను నేలపాలు చేయడం తో రాహుల్  పై  విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో రెండో వన్డే లో అతను  ఎలా కీపింగ్ చేస్తాడనేది ఆసక్తిగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: