టీమ్ ఇండియా జట్టు వరుస సిరీస్ లు  గెలుస్తు  దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి జట్టు ఏదైనా చిత్తు చేస్తూ వరుస సిరీస్ను సొంతం చేసుకుంటుంది. ఫార్మెట్ ఏదైనా కూడా తన సత్తా చాటుతూ దూసుకుపోతుంది టీమిండియా జట్టు. అయితే ఇంతకు మునుపెన్నడూ లేనివిధంగా పటిష్టంగా తయారై వరుస సిరీస్లలో గెలుచుకుంటే దూసుకుపోతున్న టీమిండియా జట్టుకు  ఆస్ట్రేలియా జట్టు బ్రేక్ వేసింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 255 పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది టీమిండియా. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా మాత్రం భారత బౌలర్లను చిత్తు చేస్తూ భారీ స్కోరు నమోదు చేసింది   ఒక్క వికెట్ కూడా పడకుండా 255 భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. దీంతో వరుస సిరీస్ లతో  దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు బ్రేక్ పడిందనే  చెప్పాలి. 

 

 

 ఇక చాలా రోజుల నుండి రిషబ్ పంత్ భారీ స్కోరు నమోదు చేస్తున్నారు రిషబ్ పంత్. కీపింగ్  విషయంలోనూ బ్యాటింగ్  విషయంలోనూ తన సత్తా చాటుకున్నాడు. ఇకపోతే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో రిషాబ్ పంత్  తలకు గాయం అయిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతి బ్యాట్ కు తగిలి తలకు బలంగా తగిలి  బలమైన గాయం అయింది. దీంతో రిషబ్ పంత్ కంకషన్ కు గురైనట్లు బీసీసీఐ ప్రకటించింది ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ కు బదులు రాహుల్ కీపింగ్  చేయాల్సి వచ్చింది. ఇకపోతే రిషబ్ పంత్ గాయం కారణంగా ఆస్ట్రేలియా తో జరిగిన రెండో వన్డేలో ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. 

 

 

 

 ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ స్థానం లో ఎవరు రాబోతున్నారు అనేదానిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అటు ఇప్పటికే రిషబ్ పంత్ స్థానంలో  కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి సంజు శాంసన్   తీసుకోవాలని కోహ్లీ  భావిస్తున్నట్లు సమాచారం.  అంతే కాకుండా అటు గాయం  తర్వాత జట్టులోకి బుమ్రా  ఎంట్రీ... రోహిత్ దావాన్ల  ఓపెనింగ్ తర్వాత వన్ డౌన్ లో  కోహ్లీ బ్యాటింగ్ దిగాలని చూస్తున్నట్లు సమాచారం. మొదటి వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూసిన కోహ్లీసేన ప్రస్తుతం ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరి ఈ మ్యాచ్లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: