మహేంద్ర సింగ్ ధోనీ గత కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్  లో  పేలవ ప్రదర్శన అనంతరం క్రికెట్ కు  మరింత దూరంగా ఉంటున్నాడు . ధోనీ రిటైర్మెంట్ పై ఎన్నో ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అయితే ధోనీ మాత్రం రిటైర్మెంట్ పై స్పందించిన దాఖలాలు లేవు. ధోనీ రిటైర్మెంట్ పై  ఇతర క్రికెటర్లు స్పందించారు కానీ ధోని మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అందరూ ధోనీ ఎప్పుడెప్పుడు మైదానంలోకి అడుగుపెడతాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా మరోసారి ధోని పై తమకున్న అభిమానాన్ని నమ్మకాన్ని చాటుకున్నారు అభిమానులు. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా ఘోర పరాభవం పాలైన విషయం తెలిసిందే. వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడి జట్టుకు దూరమైన నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీని  వెంటనే పిలిపించాలి అంటూ క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. 

 

 

 ఆస్ట్రేలియాతో జరిగే రెండు వన్డేలో  రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో కీపర్ గా  ధోనీ ఉండాల్సిందేనని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ధోనీ జట్టులోనే ఉంటే బ్యాటింగ్ లైనప్  కూడా బలపడుతుంది అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. తొలి వన్డేలో ఆస్ట్రేలియా బౌలర్ కమ్మిన్స్  వేసిన 44 ఓవర్లలో హెల్మెట్ కి  బంతి బలంగా తాకగా.. ఆపైన రిషబ్ పంత్ ఫిల్డింగ్  చేయలేకపోయాడు. అతని స్థానంలో కె.ఎల్.రాహుల్ వికెట్ కీపింగ్ చేశాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ కు  ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. ఇటీవలే ఎన్నడూ లేని విధంగా ఘోర ఓటమి పాలయింది టీమిండియా. ఏకంగా ఒక్క వికెట్ కూడా పడకుండా ఆస్ట్రేలియా జట్టు ఇండియా తమ  ముందు ఉంచిన టార్గెట్ ను రీచ్ అయింది ఆస్ట్రేలియా. 

 

 

 దీనిపై ఇండియన్ క్రికెట్ అభిమానులు అందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. జట్టులోకి ధోనీ పిలవాలని అంటున్నారు. ఆస్ట్రేలియాలో లాంటి జట్టుతో ఆడుతున్నప్పుడు జట్టు కూర్పు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుభవం లేని ఆటగాళ్లను బరిలోకి  దించారని ఇండియన్ క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆస్ట్రేలియా లాంటి జట్టుతో సిరీస్  సాధించాలి అంటే.. మాస్టర్ మైండ్ ధోని లాంటి  ప్లేయర్ జట్టులో ఉండాల్సిందేనని అంటున్నారు. అయితే దీనిపై బిసిసిఐ కానీ సెలక్షన్ కమిటీ కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: