2019 వన్డే ప్రపంచ కప్ తరువాత  క్రికెట్ కు తాత్కాలికంగా విరామం ప్రకటించిన టీమిండియా మాజీ సారథి  ధోనికి భారీ షాక్ ఇచ్చింది బీసీసీఐ.  2019 అక్టోబర్ నుండి 2020 సెప్టెంబర్ వరకు  ఆటగాళ్ల  కొత్త కాంట్రాక్టులను  ప్రకటించగా ఈ జాబితాలో ధోనికి  స్థానం కల్పించలేదు.  2018-2019 లో ఏ గ్రేడ్ ఆటగాడైన ధోనికి తాజాగా  బీసీసీఐ అసలు కాంట్రాక్టు పునరుద్దించలేదు. దాంతో  ధోనిని రిటైర్మెంట్ అవ్వల్సిందిగా  బీసీసీఐ సంకేతాలు పంపించింది. ఇక బీసీసీఐ తీసుకున్న ఈనిర్ణయానికి  ధోని అభిమానుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 
 
బీసీసీఐ సెంట్రల్ కాంట్రక్టులను దక్కించుకున్న ఆటగాళ్లు వీరే : 
 
 గ్రేడ్ ఏ ప్లస్ (7 కోట్లు) : కోహ్లీ , రోహిత్ శర్మ , బుమ్రా 
 
 గ్రేడ్ ఏ (5 కోట్లు) : ధావన్ , రాహుల్ , అశ్విన్ ,జడేజా ,భువనేశ్వర్ కుమార్ , పుజారా ,షమీ ,ఇషాంత్ శర్మ ,కుల్దీప్ యాదవ్ ,రిషబ్ పంత్ , అజింక్య రహానే 
 
గ్రేడ్ బి (3కోట్లు ) : సాహా , ఉమేష్ యాదవ్ ,యుజ్వేంద్ర చాహల్ ,హార్దిక్ పాండ్య ,మయాంక్ అగర్వాల్ 
 
గ్రేడ్ సి (కోటి) : శ్రేయాస్ అయ్యర్ , సైనీ , శార్దూల్ ఠాకూర్ ,సుందర్ ,దీపక్ చాహర్ , హనుమ విహారి ,మనీష్ పాండే ,కేదార్ జాదవ్ 

మరింత సమాచారం తెలుసుకోండి: