ప్రస్తుతం గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేల జోరు ఊపందుకుంది. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ప్రగడవరం గ్రామంలో కోడిపందాలు జరుగుతున్న తరుణంలో ఓ వ్యక్తికి కోడి కత్తి బలంగా తగలడంతో తొడ భాగంలో కోడి కత్తి కడుతున్న సందర్భంలో పుంజు బెదిరిపోయే ఒక్కసారిగా ఎగరటం తో కాలికి కట్టే కత్తి ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న చిన్న వెంకటేష్ 40 సంవత్సరాల వ్యక్తి తొడ భాగంలో గుచ్చుకోవటం తో వెంటనే అక్కడికక్కడ మృతి చెందడం జరిగింది. అయితే ఇదే విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతాల మాదిరిగానే ఆ ప్రాంతాలలో జల్లికట్టు ఆట జరుగుతుంది.

 

జరిగిన ప్రతిసారి జల్లికట్టు ఆటలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఎద్దులను నియంత్రించే ఈ ఆటలో ఎక్కువగా యువకులు పాల్గొని ఎముకులు విరిగి పోయేలా ఆట లో పాల్గొనటం కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి కూడా పరిస్థితి చేరటం వంటి సంఘటనలు జల్లికట్టు ఆటలో చోటుచేసుకుంటాయి. దీంతో చాలామంది తమిళనాడులో ఈ వేడుక జరగకూడదని జల్లికట్టు గేమ్ ఆపేయాలని చాలామంది కోర్టులను ఆశ్రయించడం జరిగింది అయితే ఈ క్రమంలో ప్రజల మనోభావాలకు దెబ్బతినకుండా ప్రభుత్వాలు పోలీసుల అంశాలతో పెట్టి సాంప్రదాయ బద్ధంగా వచ్చిన ఈ ఆటను కొనసాగిస్తూ ప్రతి సంక్రాంతి నిర్వహిస్తుంటారు.

 

గతంలో ఒకసారి జల్లికట్టు గేమ్ ఆపేయాలని భారీ ఎత్తున కోర్టు తీర్పు రావడంతో చాలా మంది తమిళ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు సినిమా స్టార్లు జల్లికట్టు ఉద్యమం చేసి ఎక్కడా కూడా జల్లికట్టు ఆట ఆగిపోకుండా వ్యవహరించడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన జల్లికట్టు గేమ్ లో చిత్తూరు జిల్లాలో ఒక యువకుడు చనిపోగా బుధవారం తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చి సురయార్‌లో జరిగిన జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఎద్దులు జనాలపై దూసుకెళ్లి బీభత్సం సృష్టించాయి. దీంతో పోటీలు చూసేందుకు వచ్చిన మహాలక్ష్మి అనే మహిళ ఎద్దుల దాడిలో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: