రాజ్ కోట్ వన్డే  జరుగే కొన్ని గంటల ముందు బీసీసీఐ  అనూహ్య నిర్ణయం తీసుకుంది. ముంబై వన్డే లో  గాయపడ్డ వికెట్ కీపర్   రిషబ్ పంత్ కు బ్యాక్ అప్ కీపర్ గా ఆంధ్రప్రదేశ్ యువ వికెట్ కీపర్  కేఎస్ భరత్ ను ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ.  దాంతో  భరత్ హైదరాబాద్ నుండి హుటాహుటిన రాజ్ కోట్  బయల్దేరాడు.  అయితే  రాజ్  కోట్ వన్డే లో మాత్రం భరత్ కు  ఛాన్స్ దక్కే అవకాశం లేదు.  మొదటి వన్డే లో  కీపింగ్ చేసిన కేఎల్ రాహులే  మరోసారి  కీపింగ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. 
 
ఇక  రిషబ్ పంత్ స్థానం లో ఆల్ రౌండర్ శివమ్ దూబే  ను తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా  మొదటి వన్డే లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో  కమ్మిన్స్ వేసిన బంతి పంత్ తలకు  బలంగా తగలడం తో  పంత్ ఆ మ్యాచ్ లో కీపింగ్ కు దిగలేదు.  ఆతరువాత వైద్యుల సూచన మేరకు పంత్ ను జాతీయ క్రికెట్ అకాడమీ లో ని రీహాబిలిటేషన్ సెంటర్ కు తరలించారు.  దాంతో పంత్ మూడో వన్డే కు కూడా అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే  మూడు మ్యాచ్ ల వన్డే  సిరీస్ లో  భాగంగా మొదటి  మ్యాచ్ లో టీమిండియా ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా  రెండో వన్డే కూడా గెలుచుకొని సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తుండగా ఈమ్యాచ్ లోనైనా గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భారత్ పట్టుదలతో వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: