వరుస విజయాలతో  దూసుకుపోతున్న టీమ్ ఇండియా జట్టు కు బలమైన ఆస్ట్రేలియా జట్టు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆపసోపాలు పడుతూ కేవలం 255 పరుగులు చేసింది టీమ్ ఇండియా.  ఆ తర్వాత బ్యాటింగ్ కు  దిగిన ఆసీస్ ఆటగాళ్లు... ఒక్క వికెట్ కూడా పడకుండానే అలవోకగా టీమిండియా తమ ముందు ఉంచిన టార్గెట్ ఛేదించారు . దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు బ్రేక్ పడిందని చెప్పాలి. కాగా నేడు రాజ్  కోట్  ఆస్ట్రేలియా టీమ్ ఇండియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా. 

 


 రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా బ్యాట్స్మెన్ లు అందరూ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు.సొగసైన షాట్లతో  భారీ సిక్సర్లు బాదుతూ అదరగొట్టారు భారత ఆటగాళ్లు . ఎలాగైనా విజయం సాధించాలనే కసి భారత బ్యాట్స్మెన్లలో కనిపించింది . ఏకంగా  ఆరు వికెట్లకు 340 పరుగులు చేసింది టీమిండియా. టీమిండియా యువ బ్యాట్స్మెన్ కె.ఎల్.రాహుల్ 52 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. కళాత్మకమైన ఆటతీరుతో రాహుల్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అంతకు ముందుగా ఓపెనర్గా వచ్చినా శిఖర్ ధావన్... 96 పరుగులతో విజృంభించగా... తృటి లో సెంచరీ తప్పింది. ఇక మరోసారి తన మార్క్ చూపించాడు గబ్బర్. 

 

 ఇక ఎప్పటిలాగే డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారీ స్కోరుకు బాటలు వేశాడు. కోహ్లీ 76 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ 42 పరుగులు చేయగా... చివర్లో వచ్చిన రవీంద్ర జడేజా మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ తో  అదరగొట్టేశాడు. 20 పరుగులతో అజేయంగా నిలిచాడు రవీంద్ర జడేజా. ఎంతో ఖర్చుతో ఇన్నింగ్స్ ఆడి భారీ స్కోరును ఆస్ట్రేలియా ముందు వుంచింది భారత్. మరి ఆస్ట్రేలియా  బ్యాట్స్మెన్లను కట్టడి చేసి ఈ మ్యాచ్లో అయినా భారత్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: