ఆ ఆటగాడు బ్యాట్  పట్టి  మైదానంలోకి దిగాడు అంటే... బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే... డబుల్ సెంచరీలు బాధడంలో ఈ  ఆటగాడికి తిరుగులేదు... భారీ స్కోర్లు సాధించడంలో... అతనికి అతనే సాటి... సొగసైన షాట్ల తో అలరిస్తూనే భారీ సిక్స్ లు కొడుతూ హోరెత్తిస్తున్నారు ఆటగాడు. ఈ ఆటగాడు ఎవరు అనుకుంటున్నారా... టీమిండియా డబుల్ సెంచరీ ల ధీరుడు..  సిక్స్ ల  వీరుడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ వరుస రికార్డులను కొల్లగొట్టుకుంటూ  తనదైన స్టైల్ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. ఫార్మెట్ ఏదైనా... ప్రత్యర్ధి ఎవరైనా తన దూకుడు ప్రదర్శిస్తూ దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. 

 

 

 ఓపెనింగ్ లో వచ్చి అద్భుతమైన ఆట తో టీమిండియాకు భారీ స్కోరును అందిస్తున్నారు. ఇక టీమిండియా విజయంలో ప్రతి మ్యాచ్లో కీలకంగా మారుతూ దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. ఇక టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్  గానే కాకుండా... టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా  కూడా జట్టు బాధ్యతలు భుజం మీద వేసుకొని టీమ్ ఆటగాళ్ల అందరిని  ముందుకు నడిపిస్తున్నారు. రోహిత్ శర్మ ఆటను చూడటానికి  అటు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపుతుంటారు.ఓ  వైపు ఆచితూచి ఆడుతూనే భారీ స్కోరును నమోదు చేస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఒకసారి రోహిత్ శర్మ బ్యాట్ జులిపించాడు  అంటే బాల్  మొత్తం గాలిలో తేలుతూ ఉంటుంది. భారి సిక్సులు  సైతం అలవోకగా బాదుతూ ఉంటాడు  రోహిత్ శర్మ. రోహిత్ శర్మ బ్యాటింగ్ కి  క్రికెట్ ప్రేక్షకుల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 

 

 

 ఇక తాజాగా రాజ్ కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఓపెనర్ గా  వన్డేల్లో అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 137 ఇన్నింగ్స్ లో  ఏడు వేల పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా ఆటగాడు హాషిం ఆమ్లా 147 ఇన్నింగ్స్ లో  ఏడు వేల పరుగులు చేసిన రికార్డు ను వెనక్కి నెట్టేశారు. మరోవైపు ఏడు వేల పరుగులు సాధించిన భారత ఆటగాడిగా సచిన్ గంగూలి సేహ్వాగ్  తర్వాత నాలుగో  ఆటగాడిగా నిలిచాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: