మొదటి వన్డే లో చిత్తుగా ఓడిన టీమిండియా శుక్రవారం జరగిన రెండో వన్డే లో 36పరుగుల తేడాతో విజయం సాదించి ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకుంది.  ఈమ్యాచ్ లో కూడా మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 50ఓవర్ల లో 6వికెట్ల నష్టానికి 340పరుగుల భారీ స్కోర్  సాధించింది. భారత్ బ్యాట్స్ మెన్ లలో శిఖర్ ధావన్ (96) తృటిలో సెంచరీ  మిస్ చేసుకోగా రాహుల్ (80), కోహ్లీ(78),రోహిత్ శర్మ (42)పరుగులతో రాణించారు. 
 
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ కు ఆరంభం లోనే ఎదురు దెబ్బ తగిలింది. 4ఓవర్ లో షమీ  బౌలింగ్  లో  వార్నర్(15) మనీష్  పాండే కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈక్యాచ్ మ్యాచ్ కు హైలైట్ గా నిలిచింది. గాల్లో ఎగురుతూ మనీష్ , వార్నర్ ఇచ్చిన క్యాచ్ ను ఒంటి చేత్తో అద్బుతంగా అందుకున్నాడు.  ఆతరువాత  ఫించ్ , స్మిత్ కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అయితే  జడేజా బౌలింగ్ లో  దూకుడుగా ఆడే క్రమంలో ఫించ్ (33)అవుట్ కాగా  స్మిత్ కు  లబుస్ షేన్ జత కలిశాడు. వీరిద్దరూ చక్కటి సమన్వయంతో ఆడుతూ  భారత్ కు  చెమటలు పట్టించారు. అయితే మళ్ళీ  జడేజానే  ఈ జోడీని విడదీశాడు.  అతని బౌలింగ్ లో షమీ కి క్యాచ్ ఇచ్చి లబుస్ షేన్   (46) అవుట్ కాగా కాసేపటికే క్యారీ(18)కూడా పెవిలియన్ చేరాడు. ఇక  గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్న స్మిత్ (98) కూడా కాసేపటికే వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బంతి తో స్మిత్ ను  బోల్తా కొట్టించాడు. ఇక్కడే మ్యాచ్ టర్న్ అయ్యింది. ఆతరువాత  క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 49.1ఓవర్లలో 304పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఇక ఈవిజయం తో భారత్   1-1 తో సిరీస్ ను  సమం చేసింది. సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో మ్యాచ్ ఆదివారం బెంగుళూరు లో జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: