అద్భుతమైన ఫామ్ తో ఏ స్థానం లో నైనా  బ్యాటింగ్ చేస్తూ  భారత విజయాల్లో తన వంతు పాత్ర ను పోషిస్తున్న  టీమిండియా యువ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ శుక్రవారం ఆస్ట్రేలియా తో జరిగిన రెండో వన్డే లో కూడా  అదరగొట్టాడు.  ఈమ్యాచ్ లో 5వ స్థానం లో బ్యాటింగ్ కు వచ్చిన రాహుల్ కేవలం 52 బంతుల్లో మూడు  సిక్సర్లు , ఆరు ఫోర్ల సాయంతో  80పరుగులు చేసి  టీమిండియా కు భారీ స్కోర్  అందించాడు. 
 
 అనంతరం వికెట్ల వెనుకాల కూడా అద్భుతంగా  కీపింగ్ చేసి  జట్టు విజయం లో కీలక పాత్ర పోషించాడు దాంతో రాహుల్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈఏడాది  వన్డే ల్లో టీమిండియా తరుపున  మొదటి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు పొందిన  ఆటగాడు కూడా  రాహులే కావడం విశేషం.  ఇక అలాగే  ఈమ్యాచ్ ద్వారా వన్డే ల్లో రాహుల్1000పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు.  తద్వారా భారత్ తరుపున  వన్డే ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో  ఈఘనత సాధించిన  నాల్గో ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: