పోర్ట్ ఎలిజబెత్ వేదికగా  ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టు లో  దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ కాగిసో  రబాడ   వికెట్ తీసిన  ఆనందం లో ఓవర్ గా రియాక్ట్ అవ్వడం తో  తదుపరి మ్యాచ్ కు బ్యాన్ అయ్యాడు. మూడో టెస్టు లో  మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా  ఇంగ్లాండ్ కెప్టెన్  జో రూట్ ను క్లీన్ బోల్డ్ చేశాడు రబాడ  అయితే ఆ ఆనందం లో రూట్ దగ్గరికి వెళ్లి  పెద్దగా అరుస్తూ..  అతని వైపు కోపంగా చూస్తూ  సెలబ్రేట్ చేసుకున్నాడు.  దాంతో అంపైర్లు అతని పై మ్యాచ్ రిఫరీ కి పిర్యాదు చేయగా ఐసీసీ  నియమావళి  ప్రకారం  రబాడ  కు మ్యాచ్ ఫీజ్ లో 15 శాతం  కోత విధించి ఓ డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు.  
 
 
ఈమ్యాచ్ కు ముందు  రబాడ  ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు ఉండగా ఇప్పుడు  తాజాగా మరోటి జత కావడంతో  రెండేళ్ల కాలంలో 4డీ మెరిట్ పాయింట్లను కలిగి ఉన్నందున ఐసీసీ, అతని పై ఓ మ్యాచ్ నిషేధం విధించింది.  దాంతో  జోహనెస్ బర్గ్ లో జరుగనున్న 4వ టెస్టు కు రబాడ  దూరం కానున్నాడు. అయితే  రబాడ   బ్యాన్ గురించి మాజీ క్రికెటర్లు  భిన్నంగా స్పందిస్తున్నారు. వికెట్ తీసి సెలబ్రేట్ చేసుకుంటే  ఏకంగా  బ్యాన్ చేస్తారాని ..  ఐసీసీ రూల్స్ పై  మండిపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: