భారత్ జట్టుకు  ప్రపంచ కప్ తోపాటు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోని కి బీసీసీఐ తాజాగా   ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లో  చోటు దక్కలేదు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా , స్పందించేందుకు నిరాకరించాడు . ధోనిని అత్యంత ఘోరంగా బీసీసీఐ అవమానించిందని అభిమానులు మండిపడుతున్నారు . టి 20 వరల్డ్ కప్ తోపాటు,   సుదీర్ఘ విరామం తరువాత వన్డే ప్రపంచ కప్ ను జట్టుకు అందించిన సారథికి  సెంట్రల్ కాంట్రాక్ట్  ఇవ్వకుండా అవమానించడం ఏమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు .

 

అయినా బీసీసీఐ ఈ విషయం పై స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కన్పించడం లేదు . ఈ విషయాన్ని గంగూలీ చెప్పకనే చెప్పేశారు . ధోని తో టి 20 వరల్డ్ కప్ , వన్డే ప్రపంచ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్ ను కూడా  బీసీసీఐ ఘోరంగా అవమానించిన విషయం తెల్సిందే . క్రికెట్ నుంచి వైదొలిగే ముందు తనకు వన్డే, టి 20  మ్యాచ్ లను ఆడేందుకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల యువీ బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు . తాను రిటైర్ అవుతానని చెబితేనే వన్డే , టి 20 మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఇస్తామని చెప్పి అవమానించారని వాపోయాడు యువీ  . ఇక ధోని పరిస్థితి కూడా ఇంచుమించు అదేవిధంగా ఉందని క్రీడాపరిశీలకులు అంటున్నారు .

 

గత ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ సెమీస్ లో న్యూజిలాండ్ తో చివరి వన్డే ఆడిన ధోని, కొంతకాలంగా విశ్రాంతి పేరిట క్రికెట్ కు దూరంగా ఉన్నాడు .  తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లో బీసీసీఐ,  ధోని కి అవకాశం కల్పించకపోవడం తో ఇక  అతడి కెరీర్ ముగిసినట్టేనన్న వాదనలు విన్పిస్తున్నాయి. ఈ తరుణం లో గంగూలీ కూడా ఈ అంశం పై స్పందించేందుకు నిరాకరించడం చూస్తుంటే ధోని కెరీర్ కు శుభం కార్డు పడినట్టే లెక్క . 

మరింత సమాచారం తెలుసుకోండి: