మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ శుభవార్త విన్పించింది . ధోని ఈ ఏడాదియే కాదు ... వచ్చే ఏడాది కూడా తమతోనే ఉంటాడని చెప్పింది . వేలం ప్రక్రియలో ఉన్న తామే ధోనిని దక్కించుకుంటామని వెల్లడించింది . ఈ మేరకు చెన్నై ప్రాంచైజీ యజమాని శ్రీనివాసన్ ఒక వీడియో సందేశం ద్వారా ధోని అభిమానులకు ఈ  ఖుషి కబురు వినిపించాడు . ఐపీల్ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ధోని , చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు .

 

చెన్నై జట్టు ఫిక్సింగ్ ఆరోపణల నేపధ్యం లో రద్దు చేసినప్పుడు మాత్రం ధోని , రైజింగ్ పూణే జాయింట్ స్టార్స్ జట్టుకు ఆడాడు . ఐపీల్ టోర్నీ లో చైన్నై జట్టును మూడుసార్లు విజేతగా నిలపడం లో కెప్టెన్ గా ధోని కీలక భూమిక పోషించాడు . గత ఏడాది ముంబయి చేతిలో చెన్నై ఓటమి పాలయింది . ఈ ఏడాది చెన్నై జట్టు విజేతగా నిలవాలని కోరుకుంటున్న అభిమానులు , ధోని క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయన్న ఊహాగానాలతో ఆందోళన చెందుతున్నారు . వారికి చెన్నై ప్రాంచైజీ యాజమాన్యం శుభవార్త విన్పించడమే కాకుండా , ఈ ఏడాది ఐపీల్ టోర్నీ ధోని ఆడే విషయంపై స్పష్టత ను ఇచ్చింది .

 

తాజాగా ప్రకటించిన బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ధోని దక్కకపోవడంతో అతను క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి . ఈ నేపధ్యం లో ధోని , ఐపీల్ క్రికెట్ టోర్నీ లో ఆడుతాడా ? లేదా ?? అని అతని అభిమానుల్లో ఒకింత ఉత్కంఠ నెలకొంది . ఐపీల్ టోర్నీ కి సన్నద్ధమైయ్యేందుకు ధోని , ఝార్ఖండ్ రంజీ జట్టు తో కలిసి సాధన చేస్తున్నాడు .  
 

మరింత సమాచారం తెలుసుకోండి: