గత కొన్ని నెలలు గా టీమిండియా తరుపున పరిమిత ఓవర్ల  క్రికెట్ కు సెలెక్ట్ అవుతున్నా.. తుది జట్టులో  ఎక్కువ గా అవకాశాలు రాబట్టుకోలేక పోతున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మనీష్ పాండే కు రాజ్ కోట్ లో ఆస్ట్రేలియా తో జరిగిన  వన్డే లో అద్భుతమైన అవకాశం వచ్చింది. అయితే ఆమ్యాచ్ లో 6వ స్థానం లో వచ్చి 2 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.  దాంతో తదుపరి మ్యాచ్ కు ఉంటాడా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే బెంగుళూరులో మరి కాసేపట్లో మొదలు కానున్న మూడో వన్డే లో కూడా  మనీష్ కు తుది జట్టులో  అవకాశం  వచ్చింది. మరి ఈమ్యాచ్ లోనైనా అతను  రాణిస్తాడో లేదో చూడాలి. 
 
ఇక ఈమ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా  టీమిండియా ఈ వన్డే కోసం జట్టులో  మార్పులు ఏమి చేయలేదు అయితే ఆసీస్ మాత్రం రిచర్డ్ సన్ స్థానంలో హేజెల్ వుడ్ ను తీసుకుంది. 
 
భారత జట్టు : 
 
రోహిత్ శర్మ , ధావన్ , రాహుల్ (కీపర్ ), విరాట్ కోహ్లీ (కెప్టెన్) ,శ్రేయాస్ అయ్యర్ , మనీష్ పాండే , జడేజా , కుల్దీప్ యాదవ్ ,సైనీ , బుమ్రా ,షమీ , 
 
ఆస్ట్రేలియా జట్టు : 
 
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్ , స్టీవ్ స్మిత్ ,లబుషెన్, అస్టోన్ టర్నర్ , అలెక్స్ క్యారీ(కీపర్) ,స్టార్క్ , జోష్ హేజెల్ వుడ్ ,పాట్ కమ్మిన్స్ ,  అష్టోన్ అగార్ ,ఆడమ్ జంపా 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: