సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌, కమిటీ సభ్యుడి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు బీసీసీఐ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఎంపికకు సంబంధించిన నిబంధనలను సైతం ఖరారు చేసింది. అభ్యర్థుల వయసును అరవైకి కుదించింది బోర్డు. దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ ఈ నెల 24గా నిర్ణయించింది బీసీసీఐ. 

 

కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, సభ్యుడు గగన్‌ ఖోడా స్థానంలో కొత్త మెంబర్లను తీసుకుంటారు. ఈ ఎంపికకు సంబంధించిన నిబంధనలు ఖరారు చేసింది బీసీసీఐ. సీనియర్‌తో పాటు మహిళల సెలక్షన్‌ కమిటీని బోర్డు పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. జూనియర్‌ కమిటీలో మాత్రం రెండు మార్పులు చేస్తోంది. దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెల 24ను చివరి తేదీగా ప్రకటించింది.

 

ఇక...ఆసక్తిగల అభ్యర్థులను క్రికెట్‌ సలహా సంఘం ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంతకు ముందు ప్రతిపాదించినట్టుగానే మదన్‌ లాల్‌, గౌతమ్‌ గంభీర్‌, సులక్షణ నాయక్‌ ఇందులో సభ్యులుగా ఉంటారో లేదో ఇంకా స్పష్టత రాలేదు. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం ఎంపికకు నిబంధనలు రూపొందించారు. అర్హత వయసు 60కి కుదించారు. దీంతో ఆశావహుల్లో ముందున్న దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అవకాశం కోల్పోయినట్లయింది. 

 

ఇక...అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదు సంవత్సరాలైనా అయి ఉండాలి. జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ అభ్యర్థుల సెలక్టర్లకు 25 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల అనుభవం అవసరం. మహిళల సెలక్షన్‌ కమిటీకైతే అభ్యర్థులు టీమిండియా తరఫున కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినా సరిపోతుంది. ఈ అర్హతలు ఉన్న ఎవరైనా బీసీసీఐకి దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి బీసీసీఐ సెలక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సత్తా ఉన్నోళ్లు నిరూపించుకోవచ్చని గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది. ఇంకేముందీ అప్లికేషన్స్ బీసీసీఐ కు వెల్లువెత్తుతున్నాయి. అవకాశమిస్తే తమ టాలెంట్ ఏంటో చూపిస్తామంటూ అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమైపోతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: