2019 వరల్డ్ కప్ నుండి అద్భుతమైన ఫామ్ లో ఉండి రికార్డు ల మీద రికార్డులు సృష్టిస్తున్న  టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తాజాగా మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.  బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడో వన్డేలో  రోహిత్  వన్డే ల్లో 9000  పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు.  తద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో  వన్డే ల్లో  వేగంగా  ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్ మెన్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈజాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(194ఇన్నింగ్స్)  మొదటి స్థానం లో ఉండగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ (205 ఇన్నింగ్స్) ఈ ఫీట్ ను సాధించి రెండోస్థానం లో వున్నాడు. కాగా రోహిత్ 217 ఇన్నింగ్స్ ల ద్వారా  ఈ ఘనత సాధించాడు. 

 

ఇక  ఆసీస్ తో జరుగుతున్న మూడో వన్డే లో భారత్ విజయం దిశగా పయనిస్తుంది.  287పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన టీమిండియా  ప్రస్తుతం 32 ఓవర్ల లో వికెట్ నష్టానికి 175పరుగులు చేసింది. రోహిత్ 111*,కోహ్లీ 38* పరుగుల తో క్రీజ్ లో వున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: