వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు మొదటి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు వన్డే మ్యాచ్ లో  పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా నేడు  బెంగళూరు వేదికగా మూడో వన్డే మ్యాచ్ జరుగుతుంది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ లక్ష్య ఛేదనలో నిలకడగా పయనిస్తుంది. అయితే భారత బ్యాట్ మెన్స్  అందరూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లు అందరికీ చుక్కలు చూపిస్తూ భారీ సిక్సులు  ఫోర్ లు బాదుతున్నారు . బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి సెంచరీ సాధించి అద్భుతమైన ఆటతీరుతో అందరి మనసులు గెలుచుకున్నాడు. 

 

 

 చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న హిట్మాన్  రోహిత్  శర్మ  కెరీర్లో మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ మరో వరల్డ్ కప్ ఖాతాలో వేసుకున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు సాధించిన కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్  విరాట్ కోహ్లీ. కేవలం 82 ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు నమోదు చేసి రికార్డు సృష్టించారు. కాగా ఈ రికార్డ్  అంతకు ముందు మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. 5 వేల పరుగులు పూర్తి చేయడానికి ఒక కెప్టెన్ గా ధోనికి  125 ఇన్నింగ్స్  ఆడాల్సి వచ్చింది. దీంతో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధిస్తే విరాట్ కోహ్లీ మరో వరల్డ్ రికార్డు సాధించాడు. 

 

 

 కాగా  ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ విరాట్ కోహ్లీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన రికార్డు ను తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్లో దిగ్గజ క్రికెటర్ లు  సృష్టించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేస్తూ తన పేరుని లికించుకుంటున్నారు విరాట్ కోహ్లీ. కాగా  ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్ను కైవసం చేసుకుంది. మరోసారి టీమిండియా తిరుగులేదు అని నిరూపించింది. ఎంతో ప్రతిభ గల  జట్టయినా ఆస్ట్రేలియను  సైతం చిత్తుచేసి సిరీస్ను కైవసం చేసుకుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: