టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని ఎన్నో రికార్డులు చేశాడో అందరికి తెలిసిందే. అయితే ఆ రికార్డులు అన్నింటిని ఒకొక్కటి బ్రేక్ చేస్తూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలోనే మరో సంచలన రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. వివరాల్లోకి వెళ్తే.. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 

 

అంతేకాదు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు బ్రేక్ చేశాడు. మిచెల్ స్టార్క్ వేసిన 23 ఓవర్ మూడో బంతిని ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా బౌండరీ తరలించిన కోహ్లీ.. అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్‌గా 5000 పరుగులు పూర్తిచేసుకున్నాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న తొలి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 

 

82 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఈ ఫీట్ సాధించగా.. ధోని 127 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. కాగా మొదటి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు వన్డే మ్యాచ్ లలో టీమిండియా జట్టు ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సిరీస్ గెలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: