మొదటి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టులో ఒదిన మన టీమిండియా వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఆస్ట్రేలియాతో ఆ తర్వాత జరిగిన రెండు వన్డే మ్యాచ్ లో పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

 

అదే పట్టుదలతో ఈరోజు కూడా సూపర్ హిట్ విజయాన్ని సాధించారు మన టీమిండియా. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఈరోజు జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. 

 

మ్యాచ్ ప్రారంభంలోనే ఫామ్‌లో ఉన్న ధవన్ మ్యాచ్‌కు దూరమవడంతో మొదట ఆందోళన కు గురైన అభిమానులు రోహిత్ శర్మ ఊపుతో ఎగిరిగంతేశారు. అనుకున్నట్టుగానే రోహిత్ శర్మ 119 పరుగులు తీసాడు. రోహిత్ శర్మతో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 89 పరుగులతో మ్యాచ్‌లో భారత్ విజయానికి బాటలు వేశాడు. వీరిద్దరూ కలిసి 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

 

రోహిత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్(44) కూడా బ్యాటు ఝుళిపించడంతో భారత్ విజయం మరింత సులువైపోయింది. ఆసీస్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లీ అవుటవడంతో బరిలోకి దిగిన మనీశ్ పాండే వరుస ఫోర్లతో మ్యాచ్‌ను ముగించేశాడు. దీంతో సిరీస్ మన సొంతమా అయ్యింది. విరాట్ కోహ్లీ ఆనందానికి అవుదుల్లేకుండా పోయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: