ఆదివారం బెంగుళూరు లో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక  మూడో వన్డే లో ఆస్ట్రేలియా పై  టీమిండియా 7వికెట్ల తేడాతో గెలుపొంది   సిరీస్ ను 2-1 తో  కైవసం చేసుకుంది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన  ఆస్ట్రేలియా  నిర్ణీత 50ఓవర్ల లో 9వికెట్ల నష్టానికి 286పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ లలో  స్టీవెన్ స్మిత్ (131) , లబుషెన్ (54) రాణించగా..  భారత బౌలర్ల లో  షమి 4, జడేజా 2వికెట్లు తీయగా  కుల్దీప్ , సైని తలో వికెట్ పడగొట్టారు. 
 
 
అనంతరం లక్ష్య ఛేదనలో  భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి  47.3ఓవర్ల లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ రాహుల్ విఫలమైనా..   రోహిత్ (119) ,కోహ్లీ(89)  లకు తోడు చివర్లో  శ్రేయాస్ అయ్యర్(44) మెరుపులు మెరిపించడం తో భారత్ సునాయాస విజయాన్ని సాధించింది. ఇక సెంచరీ హీరో  రోహిత్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా ఈసిరీస్ లో మూడు మ్యాచ్ ల్లో   2అర్ధ శతకాలతో 183పరుగులు చేసిన కోహ్లీ కి మ్యాన్ అఫ్ ది సిరీస్ దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: