పోర్ట్ ఎలిజబెత్ వేదికగా  సౌతాఫ్రికా  -ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన మూడో టెస్టు లో  దక్షిణాఫ్రికా  స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఓ అరుదైన రికార్డు సృష్టించాడు.  రెండో ఇన్నింగ్స్ లో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వేసిన ఓ ఓవర్ లో  మహారాజ్  28పరుగులు రాబట్టాడు.  ఆ ఓవర్ లో  మొదటి మూడు బంతులను ఫోర్లుగా మలచగా  ఆ తరువాత రెండు బంతులను  సిక్సర్లు గా మలిచాడు ఇక చివరి బంతి కి 4బైస్ వచ్చాయి అలా ఆ ఓవర్ లో  మహారాజ్ 28పరుగులు రాబట్టాడు.  
 
తద్వారా మహారాజ్  టెస్టుల్లో ఓకే ఓవర్ లో అత్యధిక పరుగులు సాధించిన  ఆటగాళ్ల జాబితాలో  విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా , ఆసీస్ మాజీ కెప్టెన్ జార్జ్ బెయిలీ సరసన  నిలిచాడు.  2003 లో సౌతాఫ్రికా పై రాబిన్ పీటర్సన్ బౌలింగ్ లో  లారా 28పరుగులు  రాబట్టగా 2013లో బెయిలీ, ఇంగ్లాండ్ పై జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ లో 28పరుగులు రాబట్టి ఈఫీట్ ను చేరుకున్నారు.   మరి ఈ 28 పరుగుల రికార్డు ను ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి. 
 
ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టు లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో ఓటమి పాలైయింది.  ఈమ్యాచ్ లో  మొదటి ఇన్నింగ్స్ ను  ఇంగ్లాండ్ 499-9 వద్ద  డిక్లేర్ చేయగా  సౌతాఫ్రికా  209 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. దాంతో ఫాలో ఆన్ ను  కొనసాగించిన  ప్రొటీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 237పరుగులకు కుప్పకూలింది. కేశవ్ మహారాజ్ 71 పరుగుల తో రెండో ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: