తన  సహచరుడు డివిలియర్స్  ఎప్పుడైతే  క్రికెట్  కు రిటైర్మెంట్ ప్రకటించాడో అప్పటినుండి  గడ్డు పరిస్థితులను  ఎదుర్కొంటున్నాడు  సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్. గత ఏడాది  ప్రపంచ కప్ లో దారుణ వైపల్యం తో ఇంటి ముఖం  పట్టడం తో  టీం పైతీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆతరువాత ఇండియా తో  టెస్టు సిరీస్ లో వైట్ వాష్ కు గురికావడం అలాగే తాజాగా  సొంత గడ్డపై చాలా కాలం తరువాత ఇన్నింగ్స్ తేడాతో  ఇంగ్లాండ్  చేతిలో పరాజయాన్ని చవిచూడడం తో డుప్లెసిస్  రిటైర్మెంట్ ఇవ్వాలనే చర్చ జోరుగా  జరుగుతుంది. అతన్ని తప్పించి వన్డే , టెస్టు పగ్గాలు కూడా డికాక్ కు ఇవ్వాలని వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 
 
ఇక  మూడో టెస్టు అనంతరం మీడియా తో  మాట్లాడిన  డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  ఇప్పుడంతా నా రిటైర్మెంట్ గురించే  చర్చ నడుస్తుంది. అయితే  ఆ విషయంలో  నాకు స్పష్టత వుంది.  ఈఏడాది  జరుగనున్న  టీ 20 ప్రపంచ కప్ తరువాత  రిటైర్మెంట్  గురించి ప్రకటిస్తాను .. ఈ వరల్డ్ కప్  ముందు టెస్టులు ఎక్కువగా లేవు. ప్రస్తుతం నేను నా టీం సరిగ్గా ఆడకపోవడంతో  తీవ్ర ఒత్తిడి లో వున్నాం. ఆ ఒత్తిడిని జయించి సత్తాచాటడానికి ప్రయత్నాలు చేస్తామని డుప్లెసిస్ పేర్కొన్నాడు. 
 
ఇక తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టు లో సౌతాఫ్రికా  53 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో  ఓడిపోయింది. దాంతో  నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో  ఇంగ్లాండ్ 2-1 తో ఆధిక్యంలోకి  దూసుకెళ్లింది. ఈనెల 24నుండి జోహనెస్ బర్గ్ లో నాలుగో టెస్టు జరుగనుంది. ఈమ్యాచ్ తరువాత  సౌతాఫ్రికా వెటరన్ పేస్ బౌలర్ ఫిలాండర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: