మ్యాచ్ ఏదైనా...  ఫార్మెట్ ఏదైనా... ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే.. భారీ షాట్లతో క్రికెట్ ప్రేక్షకులందరినీ హోరెత్తిస్తాడు ఆ ఆటగాడు ... పిట్ట కొంచెం కూత గణం అనే నానుడికి  సరిగ్గా సరిపోయే ఆటగాడు ఇతడు ... ఒంటి మీద కెజీ కండ కూడా లేకపోయినా భారీ షాట్లు కొడుతూ ఉంటాడు... అతను మైదానం లో ఉన్నాడు అంటే.. స్కోర్ బోర్డు అమాంతం పెరిగి పోతూ ఉంటుంది. కేవలం బ్యాట్ తోనే కాదు ... మరోవైపు బాల్ తో  కూడా ఎంతో మంది దిగ్గజ బ్యాట్ మెన్ లకు  వెన్నులో వణుకు పుట్టించి  వికెట్లు పడగొడతాడు  ఈ ఆటగాడు. ఇక ఫిల్డింగ్  లో కూడా అతనికి అతనే సాటి అని చెప్పుకోవాలి. అద్భుతమైన ఫిల్డింగ్  చేస్తూ మ్యాచ్  చూస్తున్న ప్రేక్షకులందరినీ... ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు . ఇంతకీ ఆ ఆటగాడు ఎవరు అనుకుంటున్నారు... టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. 

 

 

 ఆడిన ప్రతి మ్యాచ్ లో  బ్యాట్ తో బాల్ తో  అద్భుత ప్రదర్శన చేస్తూ... ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులను సంపాదించిన  ఆటగాడు హార్థిక్ పాండ్యా. మైదానంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ అద్భుత ప్రదర్శన చేస్తూ ఉంటాడు. కళ్ళు చెదిరే క్యాచ్ లు.. మైదానంలో హార్థిక్ పాండ్యా సొంతం. హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తుడంటే  క్రికెట్ ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారూ . ఎందుకంటే హార్థిక్ పాండ్య బ్యాటింగ్ లో అన్ని  ఆశ్చర్యకరమైన షాట్ లే. ఎవరు ఊహించని విధంగా బంతిని బాదుతూ  మైదాన అవతలకి పంపిస్తు ఉంటాడు హార్దిక్ పాండ్యా.అయితే  హార్దిక్ పాండ్యా గత కొంతకాలంగా జట్టులో కనిపించడం లేదు అన్న విషయం తెలుసిందే. 

 

 

 కాగా హార్థిక్ పాండ్యా కు సంబంధించి తాజాగా బిసిసిఐ ఒక అప్డేట్ ఇచ్చింది. న్యూజిలాండ్తో జరిగే మూడో వన్డే సిరీస్లకు టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక కాలేదని తెలిపింది. హార్దిక్ పాండ్యా ఎంపిక చేయకపోవడంపై అసలు కారణమేంటో తెలిపింది బీసీసీఐ. ఫిట్ నెస్  కు సంబంధించి వర్క్ లోడ్ టెస్ట్ లో హార్దిక్ పాండ్యా ఫెయిల్ అయ్యాడని... ఇంకా అతను పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు అని బిసిసిఐ అధికారులు తెలిపారు.కాగా  జనవరి 24 నుంచి న్యూజిలాండ్తో భారత్ ఐదు టి 20 లు, మూడు వన్డేలు,  రెండు టెస్ట్ లు ఆడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: