అక్కడ ఒలింపిక్స్ లో ఈత పోటీలు జరుగుతున్నాయి. ఒక్కసారిగా భూకంపం వచ్చేసింది. అథ్లెట్లు, కోచ్ లు అంతా తలో దిక్కుకు పారిపోతున్నారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల బృందం, సైన్యం వచ్చేశారు. సహాయ చర్యలు చేపట్టారు.

 

ఇదంతా చదువుతుంటే మీ కో సందేహం రావాలి కదా.. అదేంటి.. ఈ ఏడాది ఒలింపిక్స్ జులై 21న ఆరంభమవుతాయి కదా? అప్పుడే ఎక్కడ మొదలయ్యాయి అనే కదా. అవును..ఇదంతా ఫేక్. అయితే ఇదంతా ముందస్తు జాగ్రత్త కోసం.. ఎందుకంటే జపాన్ లో భూకంపాలు ఎక్కువ కదా.

 

ఒకవేళ ఆటల పోటీల సమయంలో వస్తే ఎలా వ్యవహరించాలి అనే అంశంపై మాక్ డ్రిల్ అన్నమాట. అవును మరి జపాన్ వాళ్లు ఏం చేసినా పకడ్బందీగా చేస్తారు కదా. అలాంటిది ప్రపంచమంతా ఆసక్తిగా గమనించే ఒలింపిక్స్ సమయంలో తమ దేశం అభాసు పాలు కాకుండా ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటోది జపాన్. అందులో భాగమే ఈ మాక్ డ్రిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: