పాపం.. ఈ మధ్యకాలంలో వారికీ బ్యాగులు సర్దుకునే టైమింగ్ కూడా ఇవ్వడం లేదట.. ఆలా చేస్తుందట బీసీసీఐ. చాల బాధపడుతూ.. కోపం తెచ్చుకుంటున్నాడు విరాట్ కోహ్లీ.. అయినా బ్యాగ్ సర్దల్సిన అవసరం కోహ్లీకి ఏంటి.. భార్య అనుష్క ఉంది కదా.. అని ఓ నెటిజన్ ప్రశ్న. అయినా ఇప్పుడు కోహ్లీపై కామెంట్స్ కాదు.. కోహ్లీ బీసీసీఐ పై ఎందుకు ఫైర్ అయ్యాడో తెలుసుకుందాం. 

 

బీసీసీఐ సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల టీం ఇండియా క్రికెటర్లు గత కొంత కాలంగా చాలా బిజీ బిజీగా క్రికెట్ ఆడుతున్నారు. కనీస విరామ సమయం కూడా లేకుండా సిరీస్‌ల మీద సిరీస్‌లలో పాల్గొంటున్నారు. ప్రపంచకప్ నుంచీ అయితే స్వదేశంలో లేక విదేశాల్లో ఏదో ఒక దేశంతో పోటీ పడుతున్నారు. దీంతో ఆటగాళ్లపై పని భారం తీవ్రంగా పెరిగిపోతుంది. 

 

తాజాగా ఆస్ట్రేలియా సిరీస్‌ని ముగించుకున్న టీం ఇండియా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా న్యూజిలాండ్ సిరీస్‌ కోసం ఆక్లాండ్‌కు పయనమైంది. వెంటనే అక్కడ సదరు సిరీస్ కోసం ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. దీంతో ఈ విషయంపై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీపై మండిపడ్డాడు. ఈడెన్ పార్క్ వేదికగా జరిగే తొలి టీ-20కి ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ బ్యాగుల సర్దుకునే సమయం కూడా ఇవ్వటం లేదు.. బీసీసీఐ చెత్త ప్లాన్ వేసింది అంటూ మంది పడ్డారు. దీంతో అయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: