రిషబ్ పంత్... మహేంద్రసింగ్ ధోని వారసుడు గా ఎవరు రాబోతున్నారు అని టీమిండియా ప్రేక్షకులు ఆలోచిస్తున్న తరుణంలో జట్టులోకి వచ్చాడు. ఇక ధోనీ లాగే వికెట్ కీపర్ కావడం... జట్టులో 5వ స్థానంలో బ్యాటింగ్కు దిగితూ  ఉండడంతో రిషబ్ పంత్ ధోని వారసుడు అని ఎన్నో అంచనాలు పెంచుకున్నారు. అటు  టీమిండియా కూడా పంత్ కి వరుస  అవకాశాలు ఇస్తూ వచ్చింది. కానీ రిషబ్ పంత్ దేనిని  ఉపయోగించుకోలేక పోయాడు. అప్పటికే దృఢమైన మిడిలార్డర్ నిర్మించుకోవాలని టీమిండియా కసరత్తు చేస్తున్న సమయంలో... రిషబ్  పంత్  మిడిలార్డర్లో కుదురుకునేలా  చేసేందుకు సరైన ఫినిషర్ గా  మార్చేందుకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ రిషబ్ పంత్ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేక పోయాడు. 

 

 

 

 ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో గాయపడటంతో పంత్ స్థానంలో కీపర్గా కేఎల్ రాహుల్ సమర్ధవంతమైన పాత్రను నిర్వహించడంతో.. మూడో వన్డేలో రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పంత్ ను  పక్కన పెట్టేసి రాహుల్నే కొనసాగించారు. ఇక ఇప్పుడు న్యూజిలాండ్తో జరిగే టి20 జట్టులో కూడా అవకాశం దక్కలేదు రిషబ్ పంత్ కి. అయితే టీమిండియా రిషబ్ పంత్ వరుస అవకాశాలు ఇవ్వడం పై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. రిషబ్  పంత్ ను  మంచి ఫినిషర్ గా భావించే టీమిండియా ఇన్ని అవకాశాలు ఇచ్చారు అంటూ పేర్కొన్నాడు ఇర్ఫాన్ పఠాన్. కానీ టీమిండియా ఎన్ని అవకాశాలు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోవడంలో పంత్  విఫలమయ్యాడని పేర్కొన్నారు ఇర్ఫాన్ పఠాన్. 

 

 

 పంత్ టీమిండియాలో కచ్చితంగా ఒక మంచి ఫినిషర్  పాత్ర పోషించాలని... దీని కోసమే టీమిండియా అన్వేషణ సాగుతోంది అంటూ తెలిపాడు. టీమిండియా వరుస  అవకాశాలను  కల్పించినప్పటికీ... అంతర్జాతీయ స్థాయిలో మాత్రం రిషబ్ పంత్ తనకు  స్కిల్స్  మాత్రం ప్రదర్శించ లేక విఫలం అయ్యాడు అంటూ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించారు. కానీ ఐపీఎల్ లో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన రిషబ్ పంత్ మంచి ఫినిషింగ్ లు ఇచ్చాడు అంటూ గుర్తు చేశారు. కాబట్టి రిషబ్ పంత్ భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ స్థాయిలో మంచి ఫినిషర్ గా ఎదగవచ్చు ఆశాభావం వ్యక్తం చేశారు ఇర్ఫాన్ పఠాన్. పంత్ ను  మంచి ఫినిషర్  గా చూడాలని అనుకుంటున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: