ఐదు టి-20లో సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టీ-20 మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లీసేన ఒక ఓవర్ వుండగానే మ్యాచ్ ఫినిష్ చేసింది. భారత బ్యాట్స్ మాన్ లు రాహుల్ 56 పరుగులు సాధించి తన ఫాంను కొనసాగించడు. కోహ్లీ 45 పరుగులు చేయడం జరిగింది. మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సందర్భంలో చివర్లో అయ్యర్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టే రీతిలో బ్యాటింగ్ చేసి 58 పరుగులు సాధించాడు. దీంతో ఈ గెలుపుతో విదేశీ గడ్డపై భారత్ గెలవలేరు ముఖ్యంగా కివీస్ పిచ్ పై ప్రస్తుతం ఉన్న జట్టు రాణించలేదు అని కామెంట్లు చేస్తున్న తరుణంలో కోహ్లీ సేన ఈ విజయం సాధించడంతో కామెంట్లు చేసిన వాళ్లు ఇప్పుడంతా తల దించు కోవడం జరిగింది.

 

అంతేకాకుండా గతంలో వరల్డ్ కప్ మ్యాచ్ ఈ సందర్భంలో సెమీస్లో భారత్ ని దెబ్బ కొట్టిన కి న్యూజిలాండ్ కి ఈ విజయంతో భారత్ కౌంటర్ ఇచ్చినట్లయింది. కాగా మరో టి20 మ్యాచ్ వచ్చే ఆదివారం ఈ రెండు జట్ల మధ్య జరగనున్న  నేపథ్యంలో ఆ మ్యాచ్ కూడా కైవసం చేసుకోవడానికి కోహ్లీ సేన అన్ని విధాల రెడీ అవుతుంది. ఇదిలా ఉండగా న్యూజిలాండ్ లో ఒకేరోజు మూడు మ్యాచ్లు జరగటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

 

మధ్యాహ్నం 12 గంటల సమయంలో భారత జట్టు న్యూజిలాండ్ జట్టుతో తొలి టీ-20 మ్యాచ్ కోసం తలపడగా ఇదే సందర్భంలో అండర్-19 ప్రపంచ కప్ లో భాగంగా అండర్ 19 భారత యువ ఆటగాళ్లు మధ్యాహ్నం అండర్-19 న్యూజిలాండ్ జట్టుతో తలపడనున్నారు. మరో మ్యాచ్ తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో భారత ఏ జట్టు న్యూజిలాండ్ జట్టుతో రెండో అనధికారిక వన్డే ఆడనుంది. ఒకే దేశంలో ఒకే రోజు మూడు మ్యాచ్ లో భారత జట్టు తలపడటం ఇదే ప్రథమం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: