అక్లాండ్ లోని  ఈడెన్ పార్క్ వేదిక గా ఆతిథ్య న్యూజిలాండ్ , భారత్ ల మధ్య  జరిగిన మొదటి టీ 20 లో  6వికెట్ల తేడాతో టీమిండియా  ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన  న్యూజిలాండ్  నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్లనష్టానికి 203పరుగులు చేసింది. సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్ (24బంతుల్లో54) తన  శైలి కి విరుద్ధంగా బౌండరీలతో విరచుకుపడడంతో కివీస్ భారీ స్కోర్ చేసింది. 
 
అనంతరం భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన  భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే  టార్గెట్ ను ఛేజ్ చేసి  బ్యాటింగ్  ఆర్డర్  ఎంత స్ట్రాంగ్ గా ఉందో ప్రత్యర్థికి  తెలియజేసింది.  ఓపెనర్ రోహిత్ విఫలమైన  మరో ఓపెనర్ రాహుల్ , కోహ్లీ కలిసి  టీమిండియా ను విజయం వైపు నడిపించారు. ఈక్రమంలో  ఇద్దరు వెను వెంటనే అవుట్ కాగా  శివమ్ దూబే కూడా ఇలా వచ్చి అలా వెళ్ళాడు.
 
అయితే  శ్రేయస్ అయ్యర్ , మనీష్ పాండే  మిగితా పని పూర్తి చేశారు.  ముఖ్యంగా నాలుగో స్థానంలో వచ్చిన అయ్యర్  మొదట   మెల్లిగా ఆడిన  చివర్లో  మెరుపులు మెరిపించడం తో  టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది.  ఇక 29బంతుల్లో  3సిక్సర్లు , 5ఫోర్ల తో 58పరుగులు చేసి అజేయంగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: