శుక్రవారం న్యూజిలాండ్ , భారత్ ల మధ్య  జరిగిన మొదటి టీ 20 లో  6వికెట్ల తేడాతో  టీమిండియా  ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 203పరుగులు చేసింది. మున్రో (59) ,రాస్ టేలర్ (54),విలియమ్సన్ (51)రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 4వికెట్లు కోల్పోయి 19ఓవర్లోనే  విజయం సాధించింది. భారత బ్యాట్స్ మెన్ లలో శ్రేయస్ అయ్యర్ (58*),రాహుల్(56),కోహ్లీ(45) రాణించారు. 
 
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రెండు రోజుల ముందు ఇక్కడికి వచ్చి ఇలా ఆడడం అద్భుతం. 80శాతం ప్రేక్షకులు కూడా మాకే మద్దతునిచ్చారు. విజయం కోసం జట్టుకు ఏం చేయాలో దాని మీద ద్రుష్టి పెడతాం దాని కోసం ఎన్ని కఠిన నిర్ణయాలైన తీసుకుంటాం. ఇకముందు కూడా ఇలాంటి ప్రదర్శనే చేయాలనుకుంటున్నాం. ఏడాది నుండి టీ 20ల్లోకూడా మేము బాగా ఆడుతున్నాం.  ఒకానొక దశలో న్యూజిలాండ్ స్కోర్ 230 అవుతదేమోనని అనిపించింది కానీ మా బౌలర్లు చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేశారని  కోహ్లీ పేర్కొన్నాడు.  ఇక 5మ్యాచ్ ల టీ 20సిరీస్ లో ఈ గెలుపు తో భారత్ 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఆదివారం ఇరు జట్ల మధ్య రెండో టీ 20 జరుగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: